వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 1,200 కోట్ల ఆస్తి ఉన్నా ఉప ఎన్నికల్లో పిల్లాడి చేతిలో ఖేల్ ఖతం, బీజేపీకి బీజేపీ శత్రువా, పాపం ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినా ఒక్క హోస్ కోటే నియోజక వర్గంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించారు. హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ రెబల్ అభ్యర్థి శరత్ బచ్చేగౌడకు స్థానిక ప్రజలు పట్టంకట్టారు. బీజేపీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన శరత్ బచ్చేగౌడ తండ్రి బచ్చేగౌడ ప్రస్తుతం చిక్కబళ్లాపుర బీజేపీ ఎంపీ. తన ఓటమికి బీజేపీ ఎంపీ బచ్చేగౌడ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రధాన కారణం అయ్యారని రూ. 1,200 కోట్ల ఆస్తి ఆసామి, హోస్ కోటే బీజేపీ అభ్యర్థి ఎంటీబీ. నాగరాజ్ ఆరోపించారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

రూ. 1,200 కోట్ల ఆస్తి ఉంది కాని ?

రూ. 1,200 కోట్ల ఆస్తి ఉంది కాని ?

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అదే బీజేపీ రెబల్ అభ్యర్థి శరత్ బచ్చేగౌడ చేతిలో ఓడిపోయారు. రూ. 1,200 కోట్లకు పైగా ఆస్తి ఉన్న ఎంటీబీ నాగరాజ్ స్వతంత్ర పార్టీ అభ్యర్థి, తన కంటే వయసులో చాల చిన్నవాడైన శరత్ బచ్చేగౌడ చేతిలో ఓడిపోయి తీవ్ర నిరాశకు గురైనారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ తండ్రి, మాజీ మంత్రి బచ్చేగౌడ ప్రస్తతం చిక్కబళ్లాపురం బీజేపీ ఎంపీ కావడం కొసమెరుపు.

మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఇదా ఫలితం ?

మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఇదా ఫలితం ?

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఎంటీబీ నాగరాజ్ కు ఓటర్లు తగిన బుద్ది చెప్పారని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరి పెద్ద తప్పు చేశానని ఎంటీబీ నాగరాజ్ ఇప్పుడు ఏం చేస్తారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

సత్తా చాటిన శరత్ బచ్చేగౌడ

సత్తా చాటిన శరత్ బచ్చేగౌడ

2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో హోస్ కోటే నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసిన శరత్ బచ్చేగౌడ అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ చేతిలో ఓడిపోయారు. తరువాత ఎంటీబీ నాగరాజ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యడంతో హోస్ కోటే నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో హోస్ కోటే నియోజక వర్గంలో డబ్బుకు విలువ ఇవ్వని స్థానిక ఓటర్లు స్థానిక యువ నాయకుడు శరత్ బచ్చేగౌడకు మద్దతుగా నిలిచారని, ఆత్మాభిమానంతో ఓట్లు వేశారని స్థానికులు, శరత్ బచ్చేగౌడ అనుచరులు అంటున్నారు.

పిల్లాడి చేతిలో ఖేల్ ఖతం,11 వేల మెజారిటి !

పిల్లాడి చేతిలో ఖేల్ ఖతం,11 వేల మెజారిటి !

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శరత్ బచ్చేగౌడ బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ మీద సుమారు 11 వేల మెజారిటీతో విజయం సాధించారు. గత శాసన సభ ఎన్నికల్లో ఇదే ఎంటీబీ నాగరాజ్ చేతిలో ఓడిపోయిన శరత్ బచ్చేగౌడ సుమారు 18 నెలల తరువాత ప్రతీకారం తీర్చుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

బీజేపీకి బీజేపీ ఎంపీనే శత్రువు

బీజేపీకి బీజేపీ ఎంపీనే శత్రువు

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి శరత్ బచ్చేగౌడ తండ్రి, ప్రస్తుత చిక్కబళ్లాపురం బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కారణం అని ఎంటీబీ నాగరాజ్ ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఎంటీబీ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బచ్చేగౌడ, ఆయన కుమారుడు శరత్ బచ్చేగౌడ మీద నిప్పులు చెరిగారు. బీజేపీ ఓటమికి బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కారణం అయ్యారని, ఆయన్ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను డిమాండ్ చేశారు.

English summary
Karnataka Hoskote Independent Candidate Sharath Bache Gowda won against BJP candidate MTB Nagaraj in Hosakote assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X