వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల కోసం రూ. 100 కోట్లతో లక్ష బంగారు ఉంగరాలు, రూ. 12 వేల కోట్ల ఆస్తిలో ఇదో లెక్కా స్వామి?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికలు 2019లో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు రూ. వందల కోట్ల ఆస్తులు ఉన్న వారే. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ఇక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఎంటీబీ నాగరాజ్ ఆస్తి రూ. 1,200 కోట్లకు పైగానే ఉంది. హోస్ కోటే నియోజక వర్గం ఓటర్లకు రూ. 100 కోట్లు ఖర్చు చేసి లక్షకు పైగా బంగారు ఉంగరాలు పంచిపెట్టడానికి సర్వం సిద్దం చేశారని ప్రచారం జరగుతోంది. బంగారు ఉంగరాలతో పాటు ప్రెషర్ కుక్కర్లు, పట్టు చీరలు, ఖరీదైన వస్తువులు పంచి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

ప్రతి ఫ్యామిలీకి బంగారు ఉంగరం

ప్రతి ఫ్యామిలీకి బంగారు ఉంగరం

హోస్ కోటే పట్టణంతో సహ ఆ నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఓ బంగారు ఉంగరం పంచి పెట్టాలని ఎంటీబీ నాగరాజ్ నిర్ణయించారని తెలిసింది. ప్రతి బంగారు ఉంగరం ఐదు గ్రాములు ఉంటోందని తెలిసింది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంటీబీ నాగరాజ్ అనుచరులు ప్రతి ఇంటికి తిరిగి మా నాయకుడికి ఓట్లు వేస్తే మీకు బంగారు ఉంగరం ఇస్తామని ప్రచారం చేస్తున్నారని తెలిసింది.

దేవుడి బోమ్మతో 5 గ్రాములు బంగారు

దేవుడి బోమ్మతో 5 గ్రాములు బంగారు

దేవుడి ముఖం ఉన్న ఐదు గ్రాముల బంగారు ఉంగరాలు ఇప్పటికే ఎంటీబీ నాగరాజ్ తయారు చేయించారని సమాచారం. సుమారు రూ. 100 కోట్ల ఖర్చుతో లక్ష బంగారు ఉంగరాలు తయారు చేయించిన ఎంటీబీ నాగరాజ్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచిపెట్టడానికి సిద్దం అయ్యారని హోస్ కోటే నియోజక వర్గంలో ప్రచారం జరుగుతోంది.

రూ.1,200 కోట్ల ఆస్తిలో ఇదో పెద్ద లేక్కా ?

రూ.1,200 కోట్ల ఆస్తిలో ఇదో పెద్ద లేక్కా ?

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంటీబీ నాగరాజ్ ఆస్తి రూ. 1,200 కోట్లకు పైగా ఉంది. అంత ఆస్తి ఉన్న ఎంటీబీ నాగరాజ్ ప్రతి ఇంటికి ఓ బంగారు ఉంగరం పంచిపెట్టడం పెద్ద లెక్కలోకి రాదని స్థానిక ప్రజలు అంటున్నారు. ఓటర్లకు బంగారు ఉంగరాలు పంచిపెడుతున్న విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఎన్నికల సంఘం నిఘా !

ఎన్నికల సంఘం నిఘా !

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక నిఘా వేశారని తెలిసింది. ఎంటీబీ నాగరాజ్ భారీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ప్రతి రోజు కనీసం రూ. 30 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న ఓటర్లు చెప్పారని కన్నడ మీడియా అంటోంది. అయితే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నా ఎన్నికల కమిషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ముగ్గురికీ రూ. వందల కోట్ల ఆస్తులు

ముగ్గురికీ రూ. వందల కోట్ల ఆస్తులు

హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురికీ రూ. వందల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ్ కు ఏకంగా రూ. 1,200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ భార్య పద్మావతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పద్మావతి సురేష్ ఆస్తులు రూ. వంద కోట్లకు పైగా ఉన్నాయి. ఇక బీజేపీ రెబల్ అభ్యర్థి శరత్ బచ్చేగౌడ సైతం స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శరత్ బచ్చేగౌడ ఆస్తులు రూ. వంద కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తం మీద హోస్ కోటే నియోజక వర్గం ప్రజలు ఉప ఎన్నికల సందర్బంగా భారీ బహుమతులు అందుకోవడానికి సిద్దం అయ్యారు.

English summary
BengaluruG: News spread in Karnataka Hoskote that BJP candidate MTB Nagaraj will give gold ring to his voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X