వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప జీవిత చరిత్రతో సినిమా, టార్గెట్ చిన్నమ్మ, ఏం చేస్తారు ?

సెంట్రల్ జైల్లో శశికళకు రాయల్ ట్రీట్ మెంట్ కు బ్రేక్, డీఐజీ రూప దెబ్బతో చిన్నమ్మకు అన్నీ కట్, రూప జీవిత చరిత్రతో సినిమా.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళకు రాయల్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారనే వాస్తవాలు వెలుగులోకి తీసుకు వచ్చిన సిన్సియర్ ఐపీఎస్ అధికారిణి, డీఐజీ రూప జీవిత చరిత్ర ఆధారంగా బహుబాష చిత్రం తెరకెక్కించడానికి రంగం సిద్దం అవుతోంది.

జైల్లో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు: డీఐజీ రూపపై పరువునష్టం దావా: అన్నాడీఎంకే వార్నింగ్ !జైల్లో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు: డీఐజీ రూపపై పరువునష్టం దావా: అన్నాడీఎంకే వార్నింగ్ !

పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని వెలుగు చూడటంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చిన డీఐజీ రూప మీద బదిలి వేటు వేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సెంట్రల్ జైలు, శశికళ గురించే చర్చ

సెంట్రల్ జైలు, శశికళ గురించే చర్చ

డీఐజీ రూప బదిలి అయిన తరువాత శశికళ వ్యవహారంలో మరింత చర్చ మొదలైయ్యింది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ప్రజలు గత 10 రోజుల నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ లగ్జరీ లైఫ్ వ్యవహారం మీద చర్చించుకుంటున్నారు. శశికళకు రాయల్ ట్రీట్ మెంట్ ఇస్తున్న వ్యవహారం వెలుగులోకి తెచ్చిన డీఐజీ రూపకు ప్రజలు భారీగా మద్దతు తెలిపారు.

Recommended Video

Sasikala was given special privileges in Bengaluru Jail, confirm authorities | Oneindia News
నాలుగు బాషల్లో సినిమా

నాలుగు బాషల్లో సినిమా

ఇదే సందర్బంలో బహుబాష దర్శకుడు ఏఎంఆర్. రమేష్ సిన్సియర్ పోలీసు అధికారిణి రూప జీవిత చరిత్ర ఆధారంగా కన్నడ, తమిళ, తెలుగు, హిందీ బాషల్లో సినిమా తెరకెక్కించడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారిణి రూప జీవిత చరిత్రను అధ్యయం చేసే పనిలో ఏఎంఆర్ రమేష్ నిమగ్నం అయ్యారు.

ఓకే అంటారా ? లేకపోతే

ఓకే అంటారా ? లేకపోతే

డీఐజీ రూపను త్వరలో కలుసుకుని ఆమె అనుమతి తీసుకుని సినిమా తెరకెక్కిస్తారని ఏఎంఆర్ రమేష్ అంటున్నారు. అయితే తన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తియ్యడానికి డీఐజీ రూప అంగీకరిస్తారా ? లేదా ? అనే విషయం వేచిచూడాలి.

రచ్చరచ్చ, శశికళ టార్గెట్ !

రచ్చరచ్చ, శశికళ టార్గెట్ !

రూప జీవిత చరిత్ర ఆధారం తెరకెక్కనున్న చిత్రంలో ముఖ్యంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్, శశికళ అవ్యవహారాలు టార్గెట్ చేసుకుని సినిమా తెరకెక్కిస్తారని సమాచారం. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వ్యవహారం విషయంలో కర్ణాటకతో సహ తమిళనాడులో రచ్చరచ్చ అయ్యింది.

రాజీవ్ గాంధీ హంతకులు !

రాజీవ్ గాంధీ హంతకులు !

బహుబాష దర్శకుడు ఏఎంఆర్ రమేష్ గతంలో నిజజీవితంలో జరిగిన వాస్తవాల ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరువాత నిందితులు బెంగళూరు నగర శివార్లలో తలదాచుకున్నారు. రాజీవ్ గాంధీ హంతకుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సైనెడ్ అనే సినిమాను ఏఎంఆర్ రమేష్ కన్నడ, తమిళ, హిందీ బాషల్లో తెరకెక్కించారు.

వీరప్పన్ ను వదల్లేదు

వీరప్పన్ ను వదల్లేదు

తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ విరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా వీరప్పన్ ( కన్నడలో అట్టహాస) అనే సినిమాను ఏఎంఆర్ రమేష్ కన్నడ, తమిళ, తెలుగు బాషల్లో తెరకెక్కించారు.

కనిపించని నాలుగో సింహం రూప

కనిపించని నాలుగో సింహం రూప

నటుడు, నిర్మాత, దర్శకుడు ఏఎంఆర్ రమేష్ ఇప్పుడు డీఐజీ రూప జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం రూపోందించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే రూప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాను అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గీయులు అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం.

English summary
Reports said that film director AMR Ramesh is planning to do a movie based on the cop Roopa's life. The director will also seek the cop's permission before making the film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X