బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త ఐఎఫ్ఎస్..భార్య ఐపీఎస్: అయినా గానీ: గర్భంతో ఉన్నా వేధింపులే: గృహహింస కేసు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ అధికారిణి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ.. ఆమెకు వరకట్న వేధింపులు తప్పట్లేదు. గృహహింసను ఎదుర్కొంటోన్నారు. భర్త, ఇతర కుటుంబ సభ్యుల శారీరకంగా, మానసిక వేధింపుల బారిన పడ్డారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గృహహింస నిరోధక చట్టం కింద పోలీసులు ఆ ఐపీఎస్ అధికారిణి భర్త, ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

జగన్ దృష్టిలో గంటా శ్రీనివాస్: రాజీనామా చేసిన మరుసటి రోజే అనూహ్యం: ఆహ్వానం..థ్యాంక్స్జగన్ దృష్టిలో గంటా శ్రీనివాస్: రాజీనామా చేసిన మరుసటి రోజే అనూహ్యం: ఆహ్వానం..థ్యాంక్స్

 విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా..

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా..

ఆమె పేరు వర్తికా కటియార్. 2010 బ్యాచ్ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (కేఎస్ఆర్‌పీ) రీసెర్చ్ పెంటర్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆమె స్వరాష్ట్రం ఉత్తర ప్రదేశ్. తన తోటి సివిల్ సర్వీస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన నితిన్ సుభాష్ యోలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో వారి వివాహమైంది. నితిన్ సుభాష్.. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శిగా పని చేస్తోన్నారు.

భర్త, బంధువుల నుంచి వేధింపులు..

భర్త, బంధువుల నుంచి వేధింపులు..

తన భర్త నితిన్, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో తాను నాలుగైదేళ్లుగా శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటోన్నానంటూ బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నితిన్..మరో ఆరుమంది కుటుంబ సభ్యుల పేర్లను ఇందులో చేర్చారు. వారిని నిందితులుగా పేర్కొన్నారు. నితిన్.. ఆయన తండ్రి సుభాష్ యోలా, తల్లి అమోల్ యోలా, బంధువులు సునీతా యోలా, సచిన్ యోలా, ప్రజక్త యోలా, ప్రద్యుమ్న యోలా పేర్లను ఈ ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.

 గర్భంతో ఉన్నా

గర్భంతో ఉన్నా

పెళ్లి సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని, అయినప్పటికీ..అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు, బంధువులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ వర్తికా కటియార్.. తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా, తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన ఈ పదేళ్ల కాలంలో పలుమార్లు తన పుట్టింటి నుంచి లక్షలాది రూపాయల నగదు, బంగారు ఆభరణాలను అదనపు కట్నంగా తీసుకున్నారని.. రోజులు గడిచేకొద్దీ అదనపు కట్నం మరింత తేవాలంటూ భర్త, అత్తామామలు వేధిస్తున్నారని ఆమె లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. గర్భం దాల్చిన సమయంలోనూ శారీరకంగా వేధింపులు తప్ప లేదని చెప్పారు.

 నితిన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు..

నితిన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు..

వర్తికా కటియార్ భర్త నితిన్ సుభాష్ యోలా, అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు పలు సెక్షన్ల కింద కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్, వరకట్న నిరోధక చట్టం కింద 3, 4, 506, 509, 34, 498ఏ, 384, 420, 326 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నితిన్‌ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసేలా డీఓపీటీకి ఆమె లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గృహహింసకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించాలని వర్తికా కటియార్ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

English summary
Vartika Katiyar, A 2010-batch Karnataka IPS officer, has filed a complaint of dowry-related violence and harassment against her husband, IFS officer, Niteen Subhash Yeola and his family in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X