బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు టెక్కీ భార్యతో ఐపీఎస్ అధికారి రోమ్యాన్స్: వేటు పడింది, కేంద్రానికి నివేదిక!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రాసలీలలు జరిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ భీమాశంకర్ ను బదిలి చేశారు. భీమాశంకర్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐపీఎస్ అధికారి భీమాశంకర్ రాసలీలల కేసు విచారణ జరుగుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంతి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

ఒకే సారి ఇద్దరు

ఒకే సారి ఇద్దరు

బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీగా బెంగళూరు పశ్చిమ విభాగం డీసీపీ టి.పి. శివశంకర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఎస్పీగా ఉన్న డాక్టర్ సుమనను కొడుగు జిల్లా ఎస్పీగా బదిలి చేశామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మంగళవారం మీడియాకు చెప్పారు.

కేంద్రానికి అధికారం

కేంద్రానికి అధికారం

ఐపీఎస్ అధికారి భీమాశంకర్ రాసలీలల కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మంగళవారం వివరణ ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

రాసలీలల ఐపీఎస్

రాసలీలల ఐపీఎస్

ఐపీఎస్ అధికారి భీమాశంకర్ యూనీఫాంలో రాసలీలలు జరిపిన వీడియోను వివాహిత మహిళ భర్త స్వయంగా ప్రైవేటు టీవీ చానల్స్ కు విడుదల చేశారు. ఐపీఎస్ అధికారి భీమాశంకర్ రాసలీలల కేసు విషయంలో విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డీజీపీ నిలమణి రాజుకు ఆదేశాలు జారీ చేశామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

టెక్కీ ఆవేదన

టెక్కీ ఆవేదన

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఐపీఎస్ అధికారి భీమాశంకర్ విచ్చలవిడిగా తిరుగుతున్నాడని వివాహిత మహిళ భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆరోపిస్తున్నారు. తన భార్యతో ఐపీఎస్ అధికారి భీమాశంకర్ రాసలీలల జరుపుతున్న వీడియోలు, ఫోటోలు ఇవే అంటూ బాధిత టెక్కీ మీడియాకు, ప్రైవేటు టీవీ చానల్స్ కు ఇచ్చారు. తన భార్యతో అక్రమ సంబంధం ఏమిటని ప్రశ్నించిన తనను ఎన్ కౌంటర్ లో అంతం చేస్తానని ఐపీఎస్ అధికారి భీమాశంకర్ బెదిరించాడని టెక్కీ ఆరోపిస్తున్నాడు.

English summary
Karnataka IPS officer who is in the news for allegedly having Illegal relationship with a techie's wife. video of IPS officer's romance with that women shown on private news Chanel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X