• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రయాణికురాలి కండక్టర్ అసభ్య ప్రవర్తన: బస్సులో చెయ్యి పట్టుకుని మరీ.. !

|

బెంగళూరు: ఓ ప్రయాణికురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టపగలే.. ఆ ప్రయాణికురాలి చెయ్యి పట్టుకుని మరీ వికృతంగా వ్యవహరించాడు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. పలుమార్లు వారించినప్పటికీ.. అతను తన వైఖరిని మార్చుకోకపోవడంతో బాధిత మహిళ.. అతని వికృత చర్యలను తన సెల్‌ఫోన్‌లో బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో అతని పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది.

ఆ కండక్టర్ పేరు శశిహరి షాలూర్. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు డిపోలో పనిచేస్తున్నారు. పుత్తూరు నుంచి హసన్‌కు బయలుదేరిన బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలో అతను ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పుత్తూరులో బస్సు ఎక్కిన ఓ మహిళ హసన్‌ వరకు ప్రయాణించాల్సి ఉంది. ఆ సమయంలో బస్సులో పెద్దగా ప్రయాణికులు లేరు. బాధిత మహిళ ఒంటరిగా ఉండటంతో ఆమె పక్కనే కూర్చున్నాడా కండక్టర్. ఆమెతో మాటలు కలిపాడు. ఒంటి మీద చేతులు వేస్తూ. అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Karnataka: KSRTC bus conductor suspended for misbehaving with woman passenger

ఆమె వారించే ప్రయత్నం చేసినప్పటికీ.. వినిపించుకోలేదా కండక్టర్. వినీ విననట్లు నటించాడు. దీనితో చిర్రెత్తిపోయిన బాధితురాలు.. తన మొబైల్ ఫోన్ ద్వారా అతని అసభ్య ప్రవర్తనను చిత్రీకరించారు.

Karnataka: KSRTC bus conductor suspended for misbehaving with woman passenger
    Kambala Jockey Srinivasa Gowda Running Video | Oneindia Telugu

    హసన్‌కు చేరుకున్న వెంటనే ఆమె ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని కేఎస్ఆర్టీసీ అధికారులకు షేర్ చేశారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే కేఎస్ఆర్టీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. శశిహరిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

    English summary
    In yet another shocking incident, a KSRTC bus conductor has been accused of misbehaving a woman passenger in the bus. The incident took place when the passenger was travelling from Puttur to Hassan. The accused has been identified as Shashihari Shalur. It is learnt that the bus conductor had sat beside her in the vacant seat next to her.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
    X