వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady SI రచ్చ రచ్చ: నేను చెప్పినట్లు చెయ్యాలి, పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా, దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: జీపులో డీజిల్ పట్టకపోవడంతో లేడీ ఎస్ఐ రెచ్చిపోయింది. నాతోనే పెట్టుకుంటారా ? మీరు ఇక్కడ ఎలా పెట్రోల్ బంక్ లో వ్యాపారం చేస్తారో నేను చూస్తాను, మీ పెట్రోల్ బంక్ కు నిప్పంటించి కాల్చి బూడిద చేస్తానని లేడీ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే పెట్రోల్ బంక్ సీజ్ చేసి తాళం వేసి తన దగ్గరకు తాళం ఇవ్వాలని నానా హంగా చేశారు. లేడీ ఎస్ఐ పురుష పదజాలంతో పెట్రోల్ బంక్ సిబ్బందిని దూషిస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో ప్రజలు హల్ చల్, కరోనా హెల్మెట్ తో పరుగో పరుగు, సూపర్ !Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో ప్రజలు హల్ చల్, కరోనా హెల్మెట్ తో పరుగో పరుగు, సూపర్ !

నేను చెప్పినట్లు చెయ్యాలి

నేను చెప్పినట్లు చెయ్యాలి

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు ప్రముఖ పర్యాటక కేంద్రం. కపిల నది పుట్టింది ఇక్కడే. అంతే కాకుండా నంజనగూడును దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు. నంజనగూడు పోలీస్ స్టేషన్ లో యాస్మిన్ తాజ్ లేడీ సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ)గా ఉద్యోగం చేస్తున్నారు. ఎస్ఐ లేడీ యాస్మిన్ తాజ్ తాను చెప్పినట్లు అందరూ చెయ్యాలని అనే తీరుతో నిత్యం వ్యవహరిస్తున్నారని సమాచారం.

డీజిల్ స్టాక్ లేదు మేడమ్

డీజిల్ స్టాక్ లేదు మేడమ్

నంజనగూడు లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ జీపులో హుల్లహళ్ళి సర్కిల్ లోని పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లారు. తరువాత తన జీపులో డీజిల్ ఫుల్ ట్యాంక్ చెయ్యాలని అక్కడ ఉన్న సిబ్బందికి ఎస్ఐ యాస్మిన్ తాజ్ చెప్పారు. అయితే డీజిల్ స్టాక్ లేదని, తరువాత జీపుకు ఫుల్ ట్యాంక్ చేస్తామని పెట్రోల్ బంక్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.

ఎంత ధైర్యం రా.... నా..... బూతు !

ఎంత ధైర్యం రా.... నా..... బూతు !

డీజిల్ స్టాక్ లేదని పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్పడంతో నా జీపుకే డీజిల్ లేదంటావా రా... అంటూ లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ బూతులు తిట్టడం మొదలు పెట్టింది. పెట్రోల్ బంక్ లో డీజిల్, పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చిన స్థానికులు రెచ్చిపోతున్న లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ ను చూసి షాక్ కు గురైనారు. చుట్టుపక్కల చూస్తున్నారు అనే విషయం మరిచిపోయిన లేడీ ఎస్ఐ పెట్రోల్ బంక్ సిబ్బందిని పురుష పదజాలంతో నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడం మొదలు పెట్టంది.

పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా !

పెట్రోల్ బంక్ కాల్చి బూడిద చేస్తా !

మర్యాదగా నా జీపులో డీజిల్ పట్టాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ అక్కడి సిబ్బందిని హెచ్చరించింది. అంతే కాకుండా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నా జీపు తీసుకెళ్లి డీజిల్ పట్టి మళ్లీ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పార్క్ చెయ్యాలని చెప్పింది. నేను చెప్పినట్లు చెయ్యకుంటే నీ పెట్రోల్ బంక్ కు నిప్పంటించి కాల్చి బూడిద చేస్తానని అక్కడే ఉన్న యజమానిని లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ హెచ్చరించింది. పెట్రోల్ బంక్ ను సీజ్ చేసి తాళం వేసి తీసుకువచ్చి తనకు చేతికి తాళం ఇవ్వాలని పోలీసులను లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ ఆదేశించింది.

కేంద్ర ఉద్యోగిని లాఠీతో చితకబాది !

కేంద్ర ఉద్యోగిని లాఠీతో చితకబాది !

పెట్రోల్ బంక్ దగ్గర లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ రెచ్చిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు ముక్కున వేలు వేసుకున్నారు. అదే సమయంలో టెలికాం శాఖ ఉద్యోగి డీజిల్ పట్టించుకోవడానికి అక్కడికి వెళ్లాడు. తన జీపుకు డీజిల్ పట్టిన తరువాత నీ జీపుకు డీజిల్ పట్టించాలని అతన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన లేడీ ఎస్ఐ లాఠీ తీసుకుని టెలికాం శాఖ ఉద్యోగిని చితకబాది అక్కడి నుంచి తరిమేశారు.

లేడీ ఎస్ఐకి సినిమా చూపించిన ఎస్పీ

లేడీ ఎస్ఐకి సినిమా చూపించిన ఎస్పీ

పెట్రోల్ బంకు దగ్గర లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ నానా హంగామా చేస్తున్న సమయంలో కొందరు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని లాఠీతో చితకబాదిన నంజనగూడు పోలీస్ స్టేషన్ లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ ను సస్పెండ్ చేశామని మైసూరు జిల్లా ఎస్పీ సీబి. రిష్యంత్ మీడియాకు చెప్పారు. లేడీ ఎస్ఐ యాస్మిన్ తాజ్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని, ఆమెను సస్పెండ్ చేసి ఇంటికి పంపించి విచారణకు ఆదేశించామని మైసూరు జిల్లా ఎస్పీ సీబి. రిష్యంత్ మీడియా వివరించారు.

English summary
Nanjangud Lady SI Warned to petrol bunk Staff because they did not put petrol in her jeep near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X