బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కౌరవుడికి కరోనా, భార్యకు పాజిటివ్, మరో 10 మంది, ఇన్స్ పెక్టర్, హీరో, నేడు మంత్రి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కొప్పళ: మంత్రి పదవిలో ఉన్న కౌరవకుడికి, ఆయన భార్యకు, వారితో సన్నిహితంగా ఉంటున్న మరో 10 మందికి కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇదేంటి కౌరవువడికి కరోనా ఎలా వచ్చింది అనుకుంటున్నారా ? అవును నిజమే కౌరవుడికి కరోనా వచ్చింది. కౌరవుడి భార్యకు కరోనా పాజిటివ్, కౌరవుడితో పాటు కారులో వెళ్లిన ఐదు మందికి కరోనా పాజిటివ్, కౌరవుడి ఇంటిలో పని చేస్తున్న మొత్తం ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. కౌరవుడు, ఆయన భార్యతో సహ మొత్తం 10 మంది ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పోలీస్ ఇన్స్ పెక్టర్ గా, హీరోగా, ఎమ్మెల్యేగా, నేడు మంత్రిగా కౌరవుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !

 బీజేపీ మంత్రి

బీజేపీ మంత్రి

కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి, హీరేకరూరు శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే బీసీ. పాటిల్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీసీ. పాటిల్ కు మంత్రి పదవి దక్కకపోవడంతో కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ తో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అయిన బీసీ. పాటిల్ తరువాత మంత్రి పదవి దక్కించుకున్నారు.

 మినిస్టర్ క్వారంటర్స్ లో కరోనా

మినిస్టర్ క్వారంటర్స్ లో కరోనా

బెంగళూరులోని మినిస్టర్స్ కాలనీలో వ్యవసాయ శాఖా మంత్రి బీసీ. పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. జులై 13వ తేదీన మంత్రి బీసీ పాటిల్ బంధువులను కలిశారు. మంత్రి బీసీ. పాటిల్ బంధువులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అప్పటి నుంచి మంత్రి బీసీ. పాటిల్, ఆయన భార్యకు కరోనా టెన్షన్ మొదలైయ్యింది. మంత్రి బీసీ. పాటిల్ ఆయన భార్య, కుటుంబ సభ్యులు వైద్యపరీక్షలు చేయించుకున్నారు.

 మంత్రి, ఆయన భార్య+ 8 మందికి పాజిటివ్

మంత్రి, ఆయన భార్య+ 8 మందికి పాజిటివ్

కర్ణాటక మంత్రి బీసీ. పాటిల్, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఇంటిలోని క్వారంటైన్ లో చికిత్స చేయించుకుంటున్నామని మంత్రి బీసీ. పాటిల్ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. మొదట తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తరువాత తనకు పాజిటివ్ అని వెలుగు చూసిందని మంత్రి బీసీ పాటిల్ వివరించారు. మంత్రి బీసీ. పాటిల్, ఆయన భార్యతో పాటు బెంగళూరులో వారి ఇంటిలో పని చేస్తున్న మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఈ వివరాలను మంత్రి బీసీ, పాటిల్ స్వయంగా సోషల్ మీడియాలో వెళ్లడించారు.

 మంత్రి కారులో వెళ్లిన ఐదు మందికి కరోనా

మంత్రి కారులో వెళ్లిన ఐదు మందికి కరోనా

కర్ణాటక మంత్రి బీసీ. పాటిల్ ఇటీవల కారులో కొప్పళ జిల్లాకు వెళ్లారు. మంత్రితో పాటు కారులో మరో ఐదు మంది ప్రయాణించారు. మంత్రితో పాటు కారులో ప్రయాణించిన ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు, తన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని. తాము ధైర్యంగా హోమ్ క్వారంటైన్ లో చికిత్స చేయించుకుంటున్నామని, మాతో టచ్ లో ఉన్న ప్రతిఒక్కరూ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికైనా పాజిటివ్ వస్తే ధైర్యంగా చికిత్స చేసుకోవాలని మంత్రి బీసీ. పాటిల్ మనవి చేశారు. కరోనా వైరస్ వచ్చిన ప్రతిఒక్క వ్యక్తి ఆ వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రభుత్వం అందరికి వైద్యం అందిస్తోందని మంత్రి బీసీ. పాటిల్ తెలిపారు.

Recommended Video

Andhra Pradesh : Just Apply For E-pass And Travel To AP Without Clearance || Oneindia Telugu
 మొన్న ఇన్స్ పెక్టర్, నిన్న హీరో, నేడు మంత్రి

మొన్న ఇన్స్ పెక్టర్, నిన్న హీరో, నేడు మంత్రి

పోలీసు ఇన్స్ పెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన బీసీ. పాటిల్ తరువాత సినిమాలపై మోజుతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్యాండిల్ వుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1998లో బీసీ. పాటిల్ హీరోగా నటించిన కౌరవ సినిమా కన్నడ సినీ పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. బీసీ. పాటిల్ నటించిన కౌరవ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు (నాగేంద్రబాబు) హీరోగా రమ్యకృష్ణ తదితరులు నటించిన కౌరవుడు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. కౌరవ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ బాషల్లో రీమేక్ చెయ్యడంతో అన్ని బాషల్లో సినిమా సూపర్ హిట్ అయ్యింది. పోలీసు ఇన్స్ పెక్టర్ గా, తరువాత హీరోగా, ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా బీసీ. పాటిల్ అనేక ప్రత్యేకతలు చాటుకున్నారు.

English summary
Coronavirus: Karnataka minister and Hirekerur MLA B C Patil Get Coronavirus Positive, Minister BC Patil in Home Quarantine:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X