వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిప్పు సుల్తాన్ జయంతి బదులు అబ్దుల్ కలాం జయంతి చెయ్యండి, పుణ్యం, బళ్లారి శ్రీరాములు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాదాలకు కేంద్ర బిందువు అయిన టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించే బదులు భారతదేశం తల ఎత్తుకునేలా చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే. అబ్దుల్ కలాం జయంతి నిర్వహిస్తే పుణ్యం అయినా వస్తుందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. టిప్పు జయంతి బదులు అబ్దుల్ కలాం జయంతినే నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి శ్రీరాములు చెప్పారు.

శుక్రవారం రాయచూరులో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి హాజరైన మంత్రి బళ్లారి శ్రీరాములు అనంతరం మీడియాతో మాట్లాడారు. టిప్పు సుల్తాన్ చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాల నుంచి తొలగించే విషయంపై మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాతో మాట్లాడారు.

Karnataka Minister B Sriramulu requests people and others to celebrate Kalam Jayanti instead of Tipu Jayanti

ప్రస్తుతానికి టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించకూడదని మాత్రమే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు. పాఠ్య పుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్ చరిత్రను తొలగించాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి బళ్లారి శ్రీరాములు వివరించారు.

టిప్పు సుల్తాన్ చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించే విషయంపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని, ప్రత్యేక కమిటీ నివేదికను పరిశీలించి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి బళ్లారి శ్రీరాములు వివరించారు.

టిప్పు సుల్తాన్ చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. టిప్పు సుల్తాన్ జయంతి విషయంలో, టిప్పు చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించే విషయంపై కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

English summary
Bengaluru: Karnataka Health minister B Sriramulu Requests people And Others to Celebrate Kalam Jayanti, Instead Of Tipu Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X