వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే, తేడా లేదు, బీజేపీ మంత్రి, ఉప ఎన్నికల్లో!

|
Google Oneindia TeluguNews

మైసూరు/బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆత్మహత్య చేసుకోవడం రెండూ ఒక్కటే, అందులో ఎలాంటి తేడా లేదని కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీటీ. రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతందని, ఆ విషయం కొందరు నాయకులు గుర్తు పెట్టుకోవాలని బీజేపీ మంత్రి సీటీ. రవి చెప్పారు.

బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో!బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో!

మునిగిపోతున్న పడవ

మునిగిపోతున్న పడవ

మైసూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి సీటీ .రవి కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓ పడవ అని ఎద్దేవ చేశారు. భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో తప్పా మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం లేదని, ఆ పార్టీ నాయకులకు విలువ, భవిష్యత్తు లేదని మంత్రి సీటీ. రవి ఆరోపించారు.

సామూహిక ఆత్మహత్యలు

సామూహిక ఆత్మహత్యలు

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారు అందరూ సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటున్నామని ఇప్పటికైనా గ్రహించాలని ఆ పార్టీలో చేరుతున్న నాయకులు మంత్రి సీటీ. రవి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని ఇప్పటికైనా తెలుసుకోవాలని పలువురికి మంత్రి సీటీ. రవి సూచించారు.

 బీజేపీలో చాన్స్ లేదు

బీజేపీలో చాన్స్ లేదు

అనర్హత ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాల్లో ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమని, ఆ చాన్స్ లేదని మంత్రి సీటీ. రవి స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు ఇచ్చే విషయం బీజేపీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీటీ. రవి అన్నారు.

తరువాతే నిర్ణయం

తరువాతే నిర్ణయం

అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ చేసిన తరువాత సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుని తరువాత బీజేపీ ఓ నిర్ణయానికి వస్తోందని మంత్రి సీటీ. రవి వివరించారు. మాజీ మంత్రి, అనర్హత ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ తో మంత్రి సీటీ. రవి చర్చలు జరిపారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మంత్రి సీటీ. రవి మాట్లాడారు. మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్ తో తాను ఎలాంటి చర్చలు జరపలేదని మంత్రి సీటీ. రవి స్పష్టం చేశారు.

ఇద్దరూ సీనియర్లు

ఇద్దరూ సీనియర్లు

మాజీ మంత్రి హెచ్. విశ్వనాథ్, మాజీ మంత్రి సా.రా. మహేశ్ ల వాగ్వివాదం విషయంలో మాట్లాడిన మంత్రి సీటీ. రవి ఇద్దరూ అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ఇలా బహిరంగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ పరస్పర ఆరోపణలకు ఒక హద్దు ఉంటుందని మంత్రి సీటీ. రవి అన్నారు.

English summary
Karnataka minister CT Ravi said joining congress party is like committing suicide. He also said party not yet decided to give by elections tickets to disqualified MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X