వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టు భయంతో హైకోర్టును ఆశ్రయించిన త్రిబుల్ షూటర్ డీకే, ఈడీ కేసు, నోటీసులు జారీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయిన భారీ నీటి పారుదల శాఖా మంత్రి, త్రిబుల్ షూటర్ డీకే. శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు భయంతో ఈడీ అధికారులు జారీ చేసిన ఈసీఐఆర్ ను రద్దు చెయ్యాలని మంత్రి డీకే. శివకుమార్ హైకోర్టులో మనవి చేశారు.

ఈడీ అధికారులు మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ECIR) జారీ చేశారు. ఫిబ్రవరి 8వ తేదీన విచారణకు కచ్చితంగా హాజరుకావాలని ఈడీ అధికారులు మంత్రి డీకే. శివకుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

విచారణకు వెళితే ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో మంత్రి డీకే. శివకుమార్ సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారులు జారీ చేసిన ఈసీఐఆర్ రద్దు చెయ్యాలని మంత్రి డీకే. శివకుమార్ తన అర్జీలో హైకోర్టుకు మనవి చేశారు.

Karnataka minister D.K.Shivakumar moved the High Court of Karnataka prayed for quashing of Enforcement Case

గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులను డీకే. శివకుమార్ బెంగళూరు రిసార్టులో పెట్టి బీజేపీ నాయకులకు నిద్రలేకుండా చేశారు. కర్ణాటకలో బీజేపీ అధిక శాసన సభ స్థానాల్లో విజయం సాధించినా ఆ పార్టీ అధికారంలోకి రాకుండా డీకే. శివకుమార్ పావులు కదిపారు.

ఇదే సమయంలో ఐటీ శాఖ అధికారులు డీకే. శివకుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదలు చేశారు. ఆ సందర్బంలో లెక్కలోలేని నగదును అధికారులు గుర్తించి ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐటీ శాఖ అధికారులు సమాచారంతో మంత్రి డీకే. శివకుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

English summary
Karnataka water resources minister D.K.Shivakumar moved the High Court of Karnataka prayed for quashing of Enforcement Case Information Report (ECIR) field against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X