వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో బళ్లారి శ్రీరాములకు సీఎం, డీకేశీ బంపర్ ఆఫర్: వారికే దిక్కులేదు, నాకేం ఇస్తారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో అంటూ ఎమ్మెల్యేలు అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో అసెంబ్లీలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు దగ్గరకు నేరుగా వెళ్లిన ట్రబుల్ షూటర్, మంత్రి డీకే. శివకుమార్ మాతో కలిసి రండి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తాం అంటూ బంఫర్ ఆఫర్ ఇవ్వడంతో సీఎం కుమార్వామితో పాటు అందరూ నవ్వుకున్నారు. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసినా మీతో రాలేనని, బీజేపీలోనే ఉంటానని శ్రీరాములు నవ్వుతూనే సమాధానం ఇచ్చారు.

ఒంటరిగా శ్రీరాములు

ఒంటరిగా శ్రీరాములు

శాసన సభా సమావేశాల విరామం సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు మాత్రం తన సీటులో కుర్చుని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో సీఎం కుమారస్వామితో పాటు మంత్రి డీకే. శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర తదితరులు అక్కడే ఉన్నారు. మంత్రి డీకే శివకుమార్ నేరుగా బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు సీటు దగ్గరకు వెళ్లి ఆయనతో నవ్వుతూ మాట్లాడారు.

బీజేపీని నమ్ముకుంటే అంతే !

బీజేపీని నమ్ముకుంటే అంతే !

బీజేపీ నాయకులు నిన్ను ఉప ముఖ్యమంత్రి చెయ్యరని, రమేష్ జారకిహోళిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారని, అందుకే మీరు మా పార్టీలోకి రావాలని మంత్రి డీకే. శివకుమార్ అసెంబ్లీ సాక్షిగా నవ్వుతూ ఆహ్వానించారు. అదే సమయంలో సీఎం కుమారస్వామితో పాటు అక్కడ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. శ్రీరాములు వైపు చూసిన సీఎం కుమారస్వామి అక్కడ కుర్చోని ఏమి ఆలోచిస్తున్నావని, మా దగ్గరకు రావాలని ఆహ్వానించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు నవ్వుతూనే వారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ చేతులు ఊపారు.

నాకు వినపడలేదు

నాకు వినపడలేదు

శ్రీరాములు, మంత్రి డీకే శివకుమార్ మాట్లాడుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు గుర్తించారు. శ్రీరాములు దగ్గరకు వెళ్లిన ఎమ్మెల్యేలు డీకే. శివకుమార్ వచ్చి మీతో ఏం మాట్లాడారు ? అని శ్రీరాములుని అడిగారు. ఏదో మాట్లాడుకుంటూ తన దగ్గరకు డీకే. శివకుమార్ వచ్చారని, అయితే తనకు ఏం వినపడలేదని, స్వయంగా ఆయనే రావడంతో తాను మాట్లాడకపోవడం మర్యాదగా ఉండదని పలకరించానని శ్రీరాములు సమాధానం ఇచ్చారు.

నా పేరు వింటే భయం

నా పేరు వింటే భయం

కాంగ్రెస్ నాయకులకు నేనే అంటే భయం, నా పేరు చెబితే భయం అని శ్రీరాములు నవ్వుతూ అన్నారు. ఓ ప్రవేటు కన్నడ టీవీ చానల్ తో మాట్లాడిన శ్రీరాములు మంత్రి డీకే. శివకుమార్ తనను ముఖ్యమంత్రిని చేస్తానని ఆఫర్ ఇచ్చినా తానే కాంగ్రెస్ లోకి వెళ్లనని అన్నారు. వారి పదవులు కాపాడుకోవాలని నానా తంటాలు పడుతున్నారని, ఇక వేరే వాళ్లకు ఏం పదవులు ఇస్తారని శ్రీరాములు ప్రశ్నించారు.

English summary
Karnataka political crisis: Karnataka Minister DK Shivakumar and CM HD Kumarswamy offered BJP leader B Sriramulu to join them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X