వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ దెబ్బ: ఐటీ దాడులు, కర్ణాటక మంత్రి విచారణ, ఉక్కిరిబిక్కిరి, జ్యోతిష్యుడి ఇంటిలో ?

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం వేకువ జామున కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం వేకువ జామున కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజక వర్గం పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ ఇంటిపై ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

బీజేపీ దెబ్బ: ఒక్క ఎమ్మెల్యేని బయటకు వదలద్దు: కాంగ్రెస్ హైకమాండ్, మొత్తం రివర్స్ !బీజేపీ దెబ్బ: ఒక్క ఎమ్మెల్యేని బయటకు వదలద్దు: కాంగ్రెస్ హైకమాండ్, మొత్తం రివర్స్ !

బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది గుజరాత్ ఎమ్మెల్యేలు బసచేసిన అన్ని గదుల్లో సోదాలు చేస్తున్నారు. కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

మంత్రిని ప్రశ్నిస్తున్న అధికారులు

మంత్రిని ప్రశ్నిస్తున్న అధికారులు

బెంగళూరు నగర శివార్లలోని కనకపుర, బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని మంత్రి డీకే. శివకుమార్ ఇంటిలో బుధవారం వేకువ జామున నుంచి సోదాలు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి డీకే. శివకుమార్ ను ఐటీ అధికారులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని సమాచారం.

ఎంపీ డీకే. సురేష్

ఎంపీ డీకే. సురేష్

పార్లమెంట్ సభ్యుడు, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ సోదరుడు డీకే. సురేష్ కు చెందిన బెంగళూరు, కనకపురలోని నివాసాల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ డీకే. సురేష్ ను అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

ఎవ్వరినీ వదల్లేదు

ఎవ్వరినీ వదల్లేదు

పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ సి. రవి నివాసం ఉంటున్న కనకపురలోని ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. ఎంఎల్ సీ రవి ఇంటిలో కీలకపత్రాలతో పాటు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

ప్రముఖ జ్యోతిష్యుడి ఇంటిలో !

ప్రముఖ జ్యోతిష్యుడి ఇంటిలో !

కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ సన్నిహితుడు, ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకనాథ్ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహమ్మద్ పటేల్ ను గెలిపించడానికి ఆ పార్టీకి చెందిన గుజరాత్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయకక్షతో ఐటీ దాడులు

రాజకీయకక్షతో ఐటీ దాడులు

కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐటీ శాఖ అధికారులతో దాడులు చేయించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహమ్మద్ పటేల్ ఆరోపించారు. బెంగళూరు నగర శివార్లలోని రిసార్ట్ లో ఉన్న తమ పార్టీ గుజరాత్ ఎమ్మెల్యేలను బెదిరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అహమ్మద్ పటేల్ ఆరోపించారు.

English summary
Income Tax Department officials conduct raid at Karnataka energy minister DK Shivakumar's residence and ‘Eagleton- The Golf Village’ resort where Congress Gujarat MLAs are staying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X