వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి .. ఆదుకున్న మెట్రో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఆందోళనలు, నిరసనలు సాధారణ ప్రజలకే కాదు .. ఆమాత్యులకు కూడా తప్పవు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే ఉద్యమంతో ప్రజా ప్రతినిధులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మంగళవారం ఓ మంత్రి ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నారు. ఏం చేయాలా భగవంతుడా అని యోచించగా .. మెట్రో రైలు ఆయనను కాపాడింది.

రిజర్వేషన్ కోసం ..
కర్ణాటకలో వాల్మికీలు చెప్పుకొదగిన స్థాయిలో ఉన్నారు. అయితే వారు తమ రిజర్వేషన్లు కోసం పోరుబాట పట్టారు. తమకు 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోవడంతో ఇవాళ బెంగళూరులో నిరసన చేపట్టారు. దీంతో విదాన సౌధ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. తమకు రిజర్వేషన్ కల్పించాలని వారు నినాదాలు చేస్తున్నారు. అయితే అప్పుడే మంత్రి డీకే శివకుమార్ అటుగా వెళ్తున్నారు. సాధారణంగా వెళితే ఓకే .. కానీ ఆయన కోర్టు కేసు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఇంకేముంది గుండెల్లో రైలు పరుగెత్తాయి. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే న్యాయస్థానం నుంచి చివాట్లు తినాల్సి వస్తోందని ఆందోళన చెందారు.

karnataka minister on traffic

కాపాడిన మెట్రో ...
దీంతో మంత్రికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే తన కారు దిగిపోయారు. పక్కనే ఉన్న మెట్రోను ఆశ్రయించారు. విదాన సౌధ నుంచి కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే కోర్టు నుంచి తనకు చివాట్లు తప్పేవి కాదని ఆందోళన చెందేవారు. మొత్తానికి రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ చక్రబంధం నుంచి మంత్రికి ఉపశమనం కలిగింది. మెట్రో ద్వారా సకాలంలో కోర్టుకు చేరి .. హామ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు మంత్రి డీకే శివకుమార్.

English summary
Karnataka Minister DK Shivakumar takes metro to reach Special Court, as traffic near Vidhana Soudha, Bengaluru is affected due to protest by Valmiki community. They're demanding 7.5% reservation for their community. He's going to court for hearing in disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X