• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

sex video: ఆ అమ్మాయెవరో తెలీదు -ఆ సీడీ బోగస్ -రాజీనామా చేయను -మంత్రి రమేశ్ వివరణ

|

ఉద్యోగం ఇప్పించాలని కోరిన మహిళను లోబర్చుకుని, కామకోరికలు తీర్చుకున్నారంటూ అతితీవ్రమైన ఆరోపణలు, గడిచిన కొద్ది గంటలుగా 'మంత్రిగారి రాసలీలలు' పేరుతో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోల వివాదంపై కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోలి ఎట్టకేలకు స్పందించారు. నీచ కార్యానికి పాల్పడిన మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తోన్న నేపథ్యంలో మంత్రి స్వయంగా తన జాడపై మీడియాకు సమాచారం అందించి, తన వెర్షన్ వినిపించారు..

viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

మంత్రి రమేశ్ జర్కిహోలి.. ఓ మహిళ(25)ను చంపేస్తానని బెదిరిస్తున్నారని, కర్ణాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ (KPTC)లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, మంత్రిగారు ఆ మహిళతో కలిసున్నప్పటి వీడియోలు, ఆడియోలే ఇందుకు సాక్ష్యాలంటూ బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేశ్ కుళ్లహళ్లి మంగళవారం సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సదరు సెక్స్ వీడియోలు కాస్తా లీక్ కావడంతో జాతీయ స్థాయిలో అవి సంచలనంగా మారాయి. అయితే..

మంత్రి రమేశ్ ఎక్కడ?

మంత్రి రమేశ్ ఎక్కడ?

బెంగళూరు సిటీలోని కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ చిత్రీకరించినట్లుగా చెబుతోన్న వీడియోలో కర్ణాటక సిటీలోని రమేశ్ జర్కిహోలి, బాధిత మహిళతో కలిసున్నప్పటి దృశ్యాలు కర్ణాటక రాజకీయాలను కుదిపేశాయి. వీడియోలు బయటికొచ్చిన తర్వాత మంత్రి సడెన్ గా కనిపించకుండా పోవడంతో ఆయన జాడపై ప్రశ్నలు రేకెత్తాయి. గంటల సస్పెన్స్ తర్వాత మంత్రి రమేశ్.. తాను మైసూరులో ఉన్నానంటూ ప్రకటన చేశారు. సదరు వీడియోలపైనా వివరణ ఇచ్చారు..

ఆమె ఎవరో తెలీదు..

ఆమె ఎవరో తెలీదు..

‘‘మీడియాలో నాపై వస్తోన్న వార్తలు చూసి షాకయ్యాను. దేవుడి సాక్షిగా చెబుతున్నాను.. ఆ మహిళ ఎవరో నాకు తెలీదు. ఇందులో ఏదో తప్పు జరిగింది. నాపై కుట్ర జరిగింది. సదరు వీడియో సీడీలు నూటికి నూరు శాతం నకిలీవే అని చెప్పగలను. ఈ వీడియోల వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ గిమ్మిక్కే అని భావిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని బద్నాం చేయడానికే ఎవరో పనిగట్టుకుని ప్రయత్నిస్తోన్నట్లు అనిపిస్తోంది. దీనిపై..

 నేనెందుకు రాజీనామా చేయాలి?

నేనెందుకు రాజీనామా చేయాలి?

వీడియోల వ్యవహారంతో ముమ్మాటికీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నేను మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలి? ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. మీడియాలో వార్తలు చూశాక నేను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఫోన్ చేసి మాట్లాడాను. 21 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నాపై ఏనాడూ ఆరోపణలు రాలేదు. ఈ వీడియోల గుట్టు ఏమిటో తేల్చాల్సిందిగా సీఎంను కోరాను. దీన్ని సున్నితమైన అంశంగానే చూడాలని కోరుతున్నాను..'' అని మంత్రి రమేశ్ జర్కిహోలి వివరణ ఇచ్చారు.

ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం..

ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం..

మంత్రి సెక్స్ స్కాండల్ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో.. కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు తెలియడంలో, ఆ స్టేషన్ లోనే కేసు నమోదు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English summary
karnataka Minister Ramesh Jarkiholi, who is facing serious troubles in sex scandal case, has dismissed the allegations against him. He said there would be a comprehensive investigation into the case. minister also clarified that he would not resign because he is not guilty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X