బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 10 కోట్లు ఇవ్వు, లేదంటే తల తీసేస్తాం, మంత్రికి మాఫియా డాన్ వార్నింగ్, చివరికి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ ను చంపేస్తామని విదేశాల్లో తలదాచుకున్న మాఫియా డాన్ రవి పూజారి గ్యాంగ్ బెదిరించారు. గత నాలుగు రోజుల నుంచి మంత్రి తన్వీర్ సేఠ్ కు వరుసగా ఫోన్లు చేస్తున్న మాఫియా డాన్ రవి పూజారి గ్యాంగ్ రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేదంటే తల తీస్తామని బెదిరించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి మొబైల్ కే ఫోన్లు

మంత్రి మొబైల్ కే ఫోన్లు

కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ మొబైల్ కు మొదట మాఫియా డాన్ రవి పూజారి గ్యాంగ్ నుంచి మెసేజ్ లు వచ్చాయి. మేము చెప్పిన ప్రాంతానికి రూ. 10 కోట్లు పంపించాలని సూచించారు. తరువాత నాలుగు రోజుల నుంచి మంత్రి మొబైల్ కే వరుసగా ఫోన్లు చేసి బెదిరించారు.

నిర్లక్షం చేసిన మంత్రి

నిర్లక్షం చేసిన మంత్రి

మెసేజ్ లు వచ్చినా, నాలుగు రోజుల నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినా మంత్రి తన్వీర్ సేఠ్ మొదట నిర్లక్షం చేశారు. అయితే త్రీవస్థాయిలో మాఫియా డాన్ రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో మంత్రి తన్వీర్ సేఠ్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు.

 పరిశీలిస్తున్నాం

పరిశీలిస్తున్నాం

మంత్రి తన్వీర్ సేఠ్ మొబైల్ కు వచ్చిన మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు వేగవంతం అయ్యిందని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ మీడియాకు చెప్పారు.

మరో మంత్రికి వార్నింగ్

మరో మంత్రికి వార్నింగ్

2015లో కర్ణాటక మత్య్సశాఖ మంత్రి కే. అభయచంద్ర జైన్ కు రవి పూజారి గ్యాంగ్ నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వచ్చాయి. చెప్పిన మొత్తంలో నగదు ఇవ్వకుంటే తల తీస్తామని బెదిరించారని మంత్రి కే. అభయచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 రవి పూజారి అంటే హడల్

రవి పూజారి అంటే హడల్

బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు రవి పూజారి గ్యాంగ్ బెదిరింపు ఫోన్లు చేసి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని సమాచారం. విదేశాలకు పారిపోయిన రవి పూజారి తన గ్యాంగ్ తో అనేక మందిని బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే హత్యలు చేయించిన ఘటనలు ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

English summary
Minister for Primary and Secondary Education Tanveer Sait has complained that Ravi Poojari, a gangster, has been threatening him for the past four days demanding ₹10 crore or be killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X