వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనికుడి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మంత్రి ఖాదర్, కాశ్మీర్ లో గాయాలు, ఇక్కడ పాముకాటు !

జమ్ము కాశ్మీర్ లో సైనికుడికి గాయాలువిశ్రాంతి కోసం సొంత గ్రామానికి వస్తే పాము కాటు వేసిందిఇంజక్షన్ లేక ఇబ్బందులు, వెంటనే సహాయం చేసిన మంత్రి యూటీ ఖాదర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పాము కాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న ఓ సైనికుడిని కర్ణాటక మంత్రి యూటి. ఖాదర్ కాపాడారు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కూడకల్లు గ్రామానికి చెందిన సంతోష్ జమ్మూ కాశ్మీర్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇటీవల పాక్ సైనికుల ఎదురుకాల్పుల్లో గాయాలైన సంతోష్ అక్కడే చికిత్స పొంది విశ్రాంతి తీసుకోవడానికి సొంత గ్రామానికి చేరుకున్నాడు. నవంబర్ 5వ తేదీ ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత నాగుపాము సైనికుడు సంతోష్ ను కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు సంతోష్ ను మంగళూరులోని ఫాదర్ ముల్లా ఆసుపత్రికి తరలించారు.

Karnataka minister UT Khader helped a soldier in Mangaluru

అయితే విషం విరుగుడుకు అవసరం అయిన ఇంజక్షన్ ఆసుపత్రిలో లేకపోవడంతో సంతోష్ పరిస్థితి విషమించింది. సంతోష్ కుటుంబ సభ్యులకు వేరే దారి లేక మంత్రి యూటీ. ఖాదరన్ ను సంప్రధించారు. వెంటనే మంత్రి యూటీ. ఖాదర్ ఆసుపత్రి చేరుకున్నారు.

మంగళూరు జిల్లా వెన్లాక్ ఆసుపత్రి నుంచి మంత్రి యూటీ ఖాదర్ విషం విరుగుడుకు సంబంధించి, సంతోష్ చికిత్సకు అవసరం అయిన 10 ఇంజెక్షన్లు తెప్పించి చికిత్స చేయించారు. మంత్రి యూటీ. ఖాదర్ సరైన సమయంలో స్పంధించడంతో సైనికుడు సంతోష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మంత్రి ఖాదర్ ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

English summary
Soldier Santhosh had snake bit sunday night, his family members moved him to city hospital but unfortunately their is no necessary Injection so the Santhosh Family called minister. Khadar quickly comes to the Place and arranged 10 necessary injections from anouther hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X