వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ లీడర్ హత్య కేసు లాయర్: చంపేస్తామని బెదిరించిన మంత్రి, రక్షణ కల్పించండి !

బీజేపీ నాయకుడి దారుణ హత్య కేసు వాదిస్తున్న లాయర్చంపేస్తామని లాయర్ కు ఫోన్ చేసి బెదిరించిన కర్ణాటక మంత్రి !హోం మంత్రి న్యాయం చెయ్యాలి, కేసు వాదిస్తే చంపేస్తారా, రక్షణ కల్పించండి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ నాయకుడి హత్య కేసు వాదిస్తున్న లాయర్ ను కర్ణాటక మంత్రి చంపేస్తామని బెదరించడంతో కేసు కొత్త మలుపుతిరుగుతోంది. మంత్రి ఫోన్లు చేసి నన్ను చంపేస్తామని బెదిరించారని, వెంటనే హోం శాఖా మంత్రి జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని న్యాయవాది మనవి చేస్తున్నారు.

కర్ణాటకలోని ధారవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు, బీజేపీ నాయకుడు యోగేష్ 2016 జూన్ 15వ తేదీన దారుణ హత్యకు గురైనాడు. బీజేపీ నాయకుడు యోగేష్ హత్య కేసును ప్రముఖ న్యాయవాది ఆనంద్ వాదిస్తున్నారు. కర్ణాటక గనుల శాఖా మంత్రి వినయ్ కులకర్ణి ఇటీవల న్యాయవాది ఆనంద్ కు ఫోన్లో చేసి చంపేస్తానని బెదిరించారని వెలుగు చూసింది.

Karnataka minister Vinay Kulakarni life threat to an advocate of BJP leader murder case

న్యాయవాది ఆనంద్ ను మంత్రి వినయ్ కులకర్ణి ఫోన్ లో బెదిరించిన ఆడియో క్లిప్పంగ్స్ శుక్రవారం కన్నడ టీవీ చానల్స్ ప్రసారం చేశారు. ఈ సందర్బంగా న్యాయవాది ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ తాను కోర్టు నుంచి ఇంటికి వెలుతున్న సమయంలో నాలుగు కార్లలో తనను వెంబడించారని అన్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాను ఇంటికి వెళ్లానని, తరువాత మంత్రి వినయ్ కులకర్ణి తన మొబైల్ కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించారని న్యాయవాది ఆనంద్ ఆరోపించారు. మంత్రి బెదిరించిన ఆడియో క్లిప్పింగ్స్ ను తానే మీడియాకు ఇచ్చానని ఆనంద్ చెప్పారు.

వెంటనే హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యాలని న్యాయవాది ఆనంద్ మనవి చేశారు. బీజేపీ నాయకుడు యోగేష్ హత్య కేసులో మంత్రి ప్రమేయం ఉంటుందని కొన్ని కన్నడ టీవీ చానల్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ నాయకుడు యోగేష్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను న్యాయవాది ఆనంద్ కు ఫోన్ చేసి బెదిరించలేదని మంత్రి వినయ్ కులకర్ణి అంటున్నారు.

English summary
Karnataka Mines and Geology minister Vinay Kulakarni Life threat to an advocate of Dharawad BJP ZP member Yogesh Gowda Murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X