ప్రభుత్వం సంచలనం, రెండు లక్షల ఇళ్లు ఫ్రీ.. ఫ్రీ, ఎవరికంటే, పక్క రాష్ట్రాంలో ఎలక్షన్స్ !

బెంగళూరు: పదేళ్లుగా మరుగున పడిన 2. 32 లక్షల ఇళ్లను ఉచితంగా ఇచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించారని ఆ రాష్ట్ర గృహనిర్మాణ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శుక్రవారం బెంగళూరులో మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ విలేఖరులతో మాట్లాడుతూ నిరుపేదలకు కప్పులు అందించేందుకు స్లమ్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు, రాజీవ్‌గాంధీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ రూపొందించిన పథకం లబ్ధిదారులకు చెల్లించడంలో విఫలమైందని, ఇకపై ప్రభుత్వమే మొత్తం భరిస్తుందని అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు ఉచిత హామీలతో పాటు ఆరో హామీగా అసంపూర్తిగా ఉన్న 2. 32 లక్షల ఇళ్లను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లక్ష్యంగా పెట్టుకున్నారని కర్ణాటక మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. రూ. 8, 000 కోట్ల విలువైన 2. 32 లక్షల ఇళ్లు ఉచితంగా ఇస్తామని హంపిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.

Karnataka Minister Zameer Ahmed Khan said that the government will provide 2.32 lakh houses to the poor.

పేదలకు అందించాల్సిన ఉచిత ఇళ్లు దశలవారీగా అందజేస్తామని సీఎం సిద్దరామయ్య హామీ ఇచ్చారని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు. వచ్చే వారం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల 2. 32 లక్షల కుటుంబాలకు త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుందని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు.

బ్యాంకు రుణం అందక ఆందోళనకు గురైన వారికి ఊరట లభిస్తుందని, లబ్ధిదారులకు ఇల్లు అందుతుందని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ చెప్పారు. స్లమ్ డెవలప్‌మెంట్ బోర్డ్, రాజీవ్ గాంధీ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా నిర్మించిన ఇంటి యూనిట్ ధర రూ. 7 లక్షలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 3 లక్షల సబ్సిడీ ఉంటుందన మత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ వివరించారు. మిగిలిన నాలుగు లక్షల రూపాయలు . లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చింది. ఇకపై లబ్ధిదారుల వాటా ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+