వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనర్హత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఆడియో అస్త్రం, చాలెంజ్, విజయనగరం జిల్లా, హామీ!

|
Google Oneindia TeluguNews

బళ్లారి/బెంగళూరు: కర్ణాటకలో ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హత ఎమ్మెల్యేలు సరికొత్త ప్లాన్లు వేస్తున్నారు. బళ్లారి జిల్లాలోని విజయనగరం శాసన సభ నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ఇప్పుడు ఆడియో అస్త్రంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నేను మీ ఇంటి బిడ్డను, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అంటూ ఆనంద్ సింగ్ శపథం చేశారు.

పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో?!పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో?!

ఆడియో వైరల్

ఆడియో వైరల్

విజయనగరంను జిల్లా కేంద్రంగా చేస్తామని ఆనంద్ సింగ్ చెబుతూ విడుదల చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆనంద్ సింగ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా కేంద్రంగా చేసే వరుకు తాను నిద్రపోనని శపథం చేశారు. త్వరలోనే విజయనగరం జిల్లా కేంద్రంగా ప్రకటించే శుభవార్తను మీరు వింటారని ఆనంద్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

సీఎం హామీ?

సీఎం హామీ?

రెండు నెలల క్రితం సీఎం బీఎస్. యడియూరప్ప బళ్లారి జిల్లాలో పర్యటించారని, ఆ సమయంలో జిల్లా నాయకుల సమావేశం జరిగిందని, అదే సమయంలో విజయనగరం జిల్లా కేంద్రం చేస్తామని సీఎం పరోక్షంగా చెప్పారని ఆనంద్ సింగ్ ఆడియోలో వివరించారు.

దశాభ్దాల డిమాండ్

దశాభ్దాల డిమాండ్

విజయనగరం జిల్లా కేంద్రం చెయ్యాలనే డిమాండ్ ఈ రోజుది కాదని, దశాభ్దాలుగా అనేక మంది డిమాండ్ చేస్తున్న విషయమే అని ఆనంద్ సింగ్ గుర్తు చేశారు. మీ ఇంటి బిడ్డగా నేను హామీ ఇస్తున్నా, విజయనగరం జిల్లా కేంద్రం చేసే వరకూ నేను నిద్రపోనని ఆనంద్ సింగ్ చాలెంజ్ చేశారు.

1. 50 లక్షల పుస్తకాలు

1. 50 లక్షల పుస్తకాలు

అందరికీ నమస్కారం, నేను మీ ఇంటి బిడ్డను అంటూ ఆనంద్ సింగ్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇదే సమయంలో విజయనగరం జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇస్తూ మాజీ మంత్రి, అనర్హత ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ 1.50 లక్షల చిన్న పుస్తకాలు ముద్రించి విజయనగరం నియోజక వర్గంలో ఇంటింటికి పంచిపెట్టారు.

English summary
Karnataka: Former minister Anand Singh has released audio for the new district of Vijayanaga
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X