వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొడ కొట్టి చూడు నా తఢాఖా చూపిస్తా, సిద్దూ, డీకేశీకి ఎంటీబీ సవాల్, ఆస్తి వెయ్యి కోట్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నా నియోజక వర్గం (బెంగళూరు గ్రామీణ జిల్లా, హోస్ కోటే)లోకి వచ్చి మాజీ మంత్రి డీకే. శివకుమార్ తొడ కొట్టి చూడాలని, అప్పుడు తన తఢాఖా చూపిస్తానని అనర్హత వేటు పడిన ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఎంటీబీ. నాగరాజ్ సవాలు చేశారు. ఇలాంటి తొడ కొట్టే వాళ్లను తాను చాల మందిని చూశానని అనర్హత ఎమ్మెల్యే ఎంటీబీ. నాగరాజ్ అన్నారు. హోస్ కోటే ఎన్నికల్లో ఎంటీబీ నాగరాజ్ కు తనకు పోటీ ఉంటుందని ఇటీవల మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్ డీకే. శివకుమార్ అన్నారు. హోసకోటే వచ్చి చూస్తే తన తఢాఖ ఏమిటో చూపిస్తానని ఎంటీబీ. నాగరాజ్ మాజీ మంత్రి డీకే. శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్యకు సవాల్ చేశారు.

అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !

 మీకు మాత్రమే అధికారమా ?

మీకు మాత్రమే అధికారమా ?

తన మీద ఆరోపణలు చేస్తున్న నాయకులు అందరూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని ఎంటీబీ. నాగరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ అనే ఇంటిలో ఎన్నో ఏళ్లుగా తాను నివాసం ఉంటున్నానని, ఇప్పుడు మీరు వచ్చి తన మీద ఆరోపణలు చేస్తున్నారని ఎంటీబీ. నాగరాజ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో మీరు ఏమేమి చేశారో అన్నీ తనకు తెలుసు, అవసరం వచ్చినప్పుడు అన్నీ బయటపెడుతానని ఎంటీబీ. నాగరాజ్ డీకే. శివకుమార్ ను హెచ్చరించారు.

దేవేగౌడ, సిద్దరామయ్య కారణం

దేవేగౌడ, సిద్దరామయ్య కారణం

కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కారణం అని ఎంటీబీ. నాగరాజ్ ఆరోపించారు. గతంలో తన గుండెల్లో సిద్దరామయ్య ఉన్నారని ఎంటీబీ నాగరాజ్ పదేపదే చెప్పారు. ఇప్పుడు తన రాజకీయ గురువు సిద్దరామయ్య మీదే ఎంటీబీ. నాగరాజ్ మండిపడుతున్నారు.

మాజీ సీఎం ఆడుకున్నారు

మాజీ సీఎం ఆడుకున్నారు

సంకీర్ణ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి, ఆయన సోదరుడు హెచ్.డీ. రేవణ్ణ తన శాఖలో ఎక్కువ జోక్యం చేసుకున్నారని, అన్నీ వారు చెప్పినట్లు చెయ్యాలని తన మీద ఒత్తిడి చేసి ఆడుకున్నారని ఎంటీబీ. నాగరాజ్ ఆరోపించారు. వారి జోక్యంతో మంత్రిగా తన శాఖకు న్యాయం చెయ్యలేక రాజీనామా చేశానని ఎంటీబీ నాగరాజ్ అన్నారు. తాను రాజీనామా చేస్తానని సిద్దరామయ్యకు ముందే చెప్పానని ఎంటీబీ. నాగరాజ్ అన్నారు.

 సత్యహరిశ్చంద్రుడా ?

సత్యహరిశ్చంద్రుడా ?

తమ మీద అనర్హత వేటు వేసిన అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ ఏమైనా సత్యహరిశ్చంద్రుడా ? అని ఎంటీబీ. నాగరాజ్ ప్రశ్నించారు. రమేష్ కుమార్ తాను సత్యహరిశ్చంద్రుడు అని మాట్లాడుతున్నారని, ఆయన ఏమిటో ఆయన సొంత నియోజక వర్గం ప్రజలను అడిగితే తెలుస్తుందని ఎంటీబీ నాగరాజ్ అన్నారు. ప్రభుత్వం నిధులతో తాను హోస్ కోటేకి కేసీ. వ్యాలి నీరు తీసుకెళ్లానని, అంతే కాని రమేష్ కుమార్ ఇంటి నుంచి నీళ్లు తీసుకుపోలేదని ఎంటీబీ. నాగరాజ్ వ్యంగంగా అన్నారు.

ఎంటీబీ ఆస్తి రూ. 1, 000 కోట్లు

ఎంటీబీ ఆస్తి రూ. 1, 000 కోట్లు

హోస్ కోటే అనర్హత ఎమ్మెల్యే ఆస్తి రూ. వెయ్యి కోట్ల పైమాటే. 2018 శాసన సభ ఎన్నికల సమయంలో ఎంటీబీ. నాగరాజ్ తన ఆస్తి రూ. వెయ్యి కోట్లకు పైగా ఉందని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఎంటీబీ నాగరాజ్ అనేక వ్యాపారాలు చేస్తున్నారు. బెంగళూరులోని గరుడాచారపాళ్యలో నివాసం ఉండే ఎంటీబీ నాగరాజ్ హోస్ కోటే నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

 రూ. 12 కోట్ల రోల్స్ రాయిస్ కారు

రూ. 12 కోట్ల రోల్స్ రాయిస్ కారు

ఇటీవల రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన ఎంటీబీ నాగరాజ్ వార్తల్లో నిలిచారు. రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేసిన ఎంటీబీ నాగరాజ్ కర్ణాటకలో వరదల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి సీఎం సహాయనిధికి రూ. ఒక కోటి చెక్ ను ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు అందించారు.

English summary
MTB Nagaraju challenged DK Shivakumar and Siddaramaiah. He said let DK Shivakumar to come to his constituency first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X