వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి రాగాలు... బీజేపీ వ్యుహంలో భాగమేనా...

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం రాబోతుందని ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర్రాల్లో ఉన్న పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు స్ధబ్ధుగా ఉన్న అసమ్మతి నేతలు ఒక్కసారిగా ఆయా పార్టీల నేతలపై విరుచుకుపడుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు.ముఖ్యంగా ఎగ్జిట్స్ పోల్ ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడిన మరునాడే మధ్యప్రదేశ్ రాష్ట్ర్రంలో బలనిరూపణకు బీజేపీ డిమాండ్ చేయగా తాజగా బెంగళూర్ కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడుతున్నాయి.

కేంద్రంలో సానుకూల ఫలితాలు రానుండడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్

కేంద్రంలో సానుకూల ఫలితాలు రానుండడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారీటీ సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతోపాటు బీజేపీ మరోసారి 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకోబోతుందనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో,గత కొద్దిరోజులగా సైలంట్‌గా ఉన్న కార్ణాటక కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు తమ గళం విప్పుతున్నారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఆపార్టీ సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వంత పార్టీ నేతలపై ఫైర్

కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వంత పార్టీ నేతలపై ఫైర్

ఇందులో భాగంగానే గతంలో తనకు ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఆపార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోనీ సీనియర్ నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గుండు, మాజీ సీఎం సిద్దరామయ్యతోపాటు ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పై రోషన్ బేగ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఈనేపథ్యంలోనే దినేష్ గుండురావుది ఒక ప్లాప్ షో అని కేసీ వేణుగోపాల్ ఒక బఫూన్‌గా అభివర్ణించడంతోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఒక పొగరుబోతు అంటూ ఆరోపణలు చేశాడు. కాగా ఈ ముగ్గురి వల్ల అట్టర్ ప్లాప్ షో అయిందని అన్నారు. ఇలాంటీ వారి వల్లే ఫలితాలు తారుమారు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అసమ్మతి రాగాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అసమ్మతి రాగాలు


కాగా రాష్ట్ర్రంలో జేడీయూ ,కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో రోషన్‌బేగ్ తనకు ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు.కాని పార్టీ పరమేశ్వర్‌కు ఆ పదవినిని కట్టబెట్టడంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అసలు క్రిస్టియన్లకు సీట్లు కేటాయించలేదని మరోవైపు ముస్లింలకు సైతం ఒకే సీటు కేటాయించారని ఆయన ఆరోపించారు. ఇందుకు తాను చింతిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం తప్ప ఎలాంటీ ప్రయోజనం చేకూర్చలేదని ఆయన విమర్శించారు.

రోషన్ బేగ్ పై చర్యలు తీసుకుంటామని పార్టీ హెచ్చరికలు...

కాగా రోషన్ వ్యాఖ్యలపై పార్టీ చీఫ్ గుండురావు సీరియస్ అయ్యారు . ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఇలా మాట్లడడంపై పార్టీ తరపున వివరణ కోరతామని ఆయన అన్నారు.కాగా ఇవి అవకాశవాద రాజకీయాలకు నిదర్శమని పేర్కోన్నారు. దీంతో రోషన్ పై సరైన సమయంలో చర్యలుచేపడతామని తెలిపారు.

అధికారానికి చేరువలో బీజేపీ...

అధికారానికి చేరువలో బీజేపీ...

మరోవైపు 224 సీట్లున్నకర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 స్థానాలున్నాయి. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113స్థానాలు.ఇక ఎగ్జిట్ ఫలితాలు వెలువడినట్టే కేంద్రంలో గనక మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే... సంకీర్ణ ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలోకి వచ్చే అవకాశముందని పలువరు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.మరోవైపు కర్ణాటకలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు కూడ జరిగాయి. దీంతో ఉప ఎన్నికల్లోని రెండు స్థానాల్లో బీజేపీ గనుక గెలిస్తే బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంటుంది.

English summary
In yet another embarrassment for the Congress party in Karnataka, seven-time MLA and former minister Roshan Baig has lashed out against his own party men, especially Karnataka PradeshCongress Committee (KPCC) President Dinesh Gundu Rao and former Chief Minister Siddaramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X