వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడ్ -ఇప్పటికే 4,228 స్థానాల్లో గెలుపు, కాంగ్రెస్‌కు2,265

|
Google Oneindia TeluguNews

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లోనూ కమలదళం మెజార్టీ దిశగా వెళుతోంది. రాష్ట్రంలోని మొత్తం 6004 గ్రామపంచాయితీలు ఉండగా, వాటిలో 5,728 గ్రామ పంచాయితీలు, 226 తాలూకా పంచాయితీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. వాటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.

గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..

పార్టీల గుర్తులు లేకుండా నిర్వహించిన ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల కారణంగా కౌంటింగ్ మందకోడిగా సాగుతోంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగా, రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి, లీడ్ లో కొనసాగుతున్నారు.

Karnataka Panchayat Election Results:BJP win 4,228 seats, Congress 2,265 So Far

మొత్తం 82వేల 616 వార్డులకుగానూ ఇప్పటివరకు.. బీజేపీ బలపర్చిన 4,228 మంది అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 2,265 స్థానాలను కైవసం చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నది. 1,167 స్థానాలను గెలుచుకున్న జేడీఎస్ మూడో స్థానానికి పరిమితం అయింది. 678 స్థానాల్లో ఇండిపెండెట్లు గెలుపొందారు. ఇంకా..

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా విజయ ప్రకటలను చేయడం గమనార్హం. బ్యాలెట్ పత్రాలతో నిర్వహించిన ఎన్నికలు కావడం, కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు టేబుళ్లు, ఎక్కువ రౌండ్లతో లెక్కింపు జరుగుతుండటంతో గురువారం మధ్యాహ్నం తర్వాతగానీ తుది ఫలితాలు వచ్చే అవకాశంలేదు.

English summary
Karnataka Gram Panchayat Election Results 2020 declered on wednesday, so far, The BJP-backed candidates have won 4,228 panchayats while Congress supported candidates have emerged victorious in 2,265 panchayats. Overall, the BJP-backed candidates are doing better than others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X