congress karnatakacmrace hyderabad jds parameshwara కాంగ్రెస్ కర్ణాటక సీఎం రేస్ కర్ణాటక తీర్పు తాజ్ కృష్ణా పార్క్ హయత్ హైద్రాబాద్ పరమేశ్వర
బిజెపి ఎమ్మెల్యేలు మాతో టచ్లో: కెపీసీసీ చీఫ్ పరమేశ్వర సంచలనం
బెంగుళూరు: బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు కూడ తమతో టచ్ లో ఉన్నారని కర్ణాటక పీసీసీ చీప్ పరమేశ్వర బాంబు పేల్చారు. కర్ణాటకలో ఇప్పటికే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో బిజెపి నేతలు కూడ తమతో టచ్ లో ఉన్నారని పరమేశ్వర ప్రకటించడం సంచలనంగా మారింది.
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు ఉదయం పూట హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ లోని రెండు హోటల్స్ లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైద్రాబాద్ కు శర్మ ట్రావెల్స్ బస్సుల్లో వచ్చారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలంటే అసెంబ్లీలో ఆయనకు 112 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజెపికి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జెడి(ఎస్), కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల్లో కొందరు తమతో టచ్ లో ఉన్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ సంచలన ప్రకటనలు చేశారు.
బిజెపి ఎమ్మెల్యేలు కూడ తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చీఫ్ పరమేశ్వర శుక్రవారం నాడు ప్రకటించారు. ఆయన ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని కాంగ్రెస్ చీప్ పరమేశ్వర చెప్పారు. బిజెపి నేత యడ్యూరప్పకు ఉన్నంత తొందర తమకు లేదని పరమేశ్వర చెప్పారు. అయితే విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ఓటమి ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కూటమిలోని ఎమ్మెల్యేలను రక్షించుకొనేందుకుగాను కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. దీంతో హైద్రాబాద్ లో బస చేసిన కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలు హైద్రాబాద్ నుండి కర్ణాటకకు వీలైనంత త్వరగా కర్ణాటకకు చేరుకోనే అవకాశం ఉంటుంది.