• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా కమ్మేసిన వేళ.. గుర్రం కళేబరం అంత్యక్రియల్లో వందలాది మంది: దేవతాశ్వంగా

|

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ దేశం మొత్తాన్నీ కమ్మేసింది. రోజూ వేలాదిమందిని పొట్టనబెట్టుకుంటోంది. మూడున్నర వేల నుంచి నాలుగు వేలకు పైగా రోజువారీ మరణాలు నమోదవుతోన్నాయి.కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి నాలుగైదు రాష్ట్రాల మినహా మిగిలినవన్నీ లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. కరోనా బారిన పడి మరణించిన వారి చివరి చూపు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అలాంటి వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా అప్పగించట్లేదు డాక్టర్లు. ఆప్తులెవరూ లేకుండానే వారి అంతిమయాత్ర సాగిపోతోంది.

Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా: రూ.1500 కోట్లు కేంద్రం అడ్వాన్స్Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా: రూ.1500 కోట్లు కేంద్రం అడ్వాన్స్

ఈ పరిస్థితుల్లో ఓ గుర్రం కళేబరానికి నిర్వహించిన అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొనడం చర్చనీయాంశమౌతోంది.. వివాదానికి కేంద్రబిందువు అవుతోంది. అనారోగ్య కారణంతో తుదిశ్వాస విడిచిన ఆ అశ్వానికి నిర్వహించిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ గుర్రం కళేబరం అంతిమయాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవంక కంప్లీట్ లాక్‌డౌన్..మరోవంక అంత్యక్రియల్లో పరిమితంగా పాల్గొనాల్సి ఉంటుందనే ఆంక్షల మధ్య వందలాది మంది ఇందులో పాల్గొనడం దుమారాన్ని రేపుతోంది.

 Karnataka: People were seen at the funeral of a horse in the Belagavi as Covid19 restrictions

బెళగావిలోని మరాడీమఠ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 400 కుటుంబాల వరకు నివసించే ఊరు అది. చాలాకాలం నుంచి అక్కడ కొనసాగుతోన్న కడసిద్ధేశ్వర ఆశ్రమానికి చెందిన అశ్వం అది. దేవతాశ్వంగా భావిస్తారు స్థానికులు. తరచూ దానికి పూజలు నిర్వహిస్తుండే వారు. అనారోగ్యానికి గురైన ఆ అశ్వం.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ఆదివారం సాయంత్రం అంతిమయాత్ర చేపట్టారు. కడసిద్ధేశ్వర ఆశ్రమం మఠాధిపతి పావదేశ్వర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతిమయాత్రలో వందలామంది గ్రామస్తులు పాల్గొన్నారు. బెళగావి జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ.. పట్టించుకోలేదు.

 Karnataka: People were seen at the funeral of a horse in the Belagavi as Covid19 restrictions

ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. సమగ్ర నివేదిక అందజేయాలంటూ బెళగావి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కొన్నూర్ తహశీల్దార్ ప్రకాష్ హొళెప్పగోల్‌ను విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులను నివారించడానికి కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో వందలాది ఒకే చోట గుమికూడటాన్ని సమర్థించలేమని అన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘనగా దీన్ని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

English summary
Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi, yesterday, in violation of current COVID19 restrictions in force in Karnataka. The district administration will look into this incident, and action will be taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X