వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 ఏళ్ల చిన్నారిపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడి, చంపేస్తామని బెదిరింపులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి పక్కన సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలిక మీద ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలుకా గూడినబలి గ్రామంలో 4వ తరగతి చదువుతున్న చిన్నారి లైంగిక దాడికి గురైయ్యింది.

బాలిక మీద అత్యాచారం చేసిన గుజరి వ్యాపారి శేఖుబ్బ (35), రజాక్ (35), నవాజ్ (22) అనే కామాంధులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బంట్వాళ సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో బాలిక 4వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నది.

Karnataka police arrested 3 men for rape a minor girl

సెలవులు రావడంతో ఇటీవల గూడినబలిలోని అవ్వ ఇంటికి బాలిక వెళ్లింది. ఇంటి సమీపంలో సాటి చిన్నారులతో కలిసి బాలిక ఆడుకుంటున్న సమయంలో కామాంధుడు రజాక్ బాలిక మీద కన్ను వేశాడు. బాలికను ఇంటికి తీసుకెళ్లిన రజాక్ లైంగిక దాడి చేశాడు.

అనంతరం మరో కామాంధుడు, గుజరి వ్యాపారి శేఖుబ్బ, నవాజ్ కలిసి బాలికను నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని కామాంధులు బాలికను బెదిరించారు.

బాలిక ప్రవర్తనలో, శరీరంలో మార్పులు వచ్చి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె మీద లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులకు చెప్పారు. బాలిక కామాంధులను గుర్తించడంతో వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Bantwal police arrested 3 men for rape a minor girl. This shocking incident happened in Gudinabali village near Bantwal in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X