బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయి ఫేస్ బుక్ స్నేహం, హనీట్రాప్, రాసలీలలు, బ్లాక్ మెయిల్, కిలాడీ గ్యాంగ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫేస్ బుక్ లో యువకులను పరిచయం చేసుకుని తరువాత హనీట్రాప్ తో వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ లేడీతో సహ ముగ్గురుని బెంగళూరు నగర శివార్లలోని సోలదేవనహళ్ళి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

అర్పితా, సిద్దార్థ్, పవన్ అనే ముగ్గురిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు తెలిపారు. అర్పితా ఫేస్ బుక్ లో మారు పేరుతో మాన్వితా అనే అకౌంట్ ప్రారంభించింది. ఖరీదైన టీషర్టులు, జీన్స్ ప్యాంట్లు, ఫ్యాషన్ దుస్తులు వేసుకుని ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టింది.

 Karnataka Police arrested facebook blackmail group in Bengaluru.

తరువాత శ్రీమంతులైన యువకుల వివరాలు సేకరించి వారితో పరిచయం పెంచుకోవడానికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువకుల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్న అర్పితా వారితో చనువుగా ఉంటున్నట్లు నటించింది.

యువకులు క్లోజ్ అయిన తరువాత వారిని రాసలీలలకు రావాలని అర్పితా అహ్వానిస్తుంది. లైంగిక కోరిక తీర్చుకోవడానికి యువకులు వెళ్లిన సమయంలో అర్పితా వారితో ఏకాంతంగా గడిపింది. ఆ సందర్బంలో పవన్, సిద్దార్థ్ రాసలీలలను వీడియో తీస్తున్నారు.

ఆ విడియోలను యువకులకు చూపించి అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు వీడియోలు ఇచ్చి తనను రేప్ చేశాడని ఫిర్యాదు చేస్తానని అర్పితా బెదిరించింది. అర్పితాకు పవన్, సిద్దర్థ్ సహకరిస్తున్నారు. ఓ బాధితుడు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Karnataka Police arrested facebook blackmail group in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X