వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈద్ మిలాద్ శాంతి సభ భగ్నం, దేవాలయం రోడ్డులో జెండాలు ఫ్లెక్సీలు, లాఠీ చార్జ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: శాంతి సభ నియమాలను ఉల్లంఘించి ఈద్ మిలాద్ సందర్బంగా దేవాలయం రోడ్డులో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టడంతో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర పట్టణంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈద్ మిలాద్ పండుగ సందర్బంగా హరిహర పట్టణంలోని శ్రీ హరిహరేశ్వర దేవాలయం రోడ్డులో ఓ వర్గం వారు జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టారు. శ్రీ హరహరేశ్వర దేవాలయం రోడ్డులో జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కట్టకూడదని పోలీసుల సమక్షంలో జరిగిన శాంతిసభలో ఇరు వర్గాల వారు తీర్మాణించారు.

మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!

అయితే శాంతిసభ తీర్మాణాన్ని ఉల్లంఘించి ఓ వర్గం వారు జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చెయ్యడంతో మరో వర్గం వారు సహనం కొల్పోయారు. మాజీ శాసన సభ్యుడు బిపి. హరీష్ ఆధ్వర్యంలో పలు హిందూ సంఘ, సంస్థలు శనివారం దేవాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు తొలగించడానికి ప్రయత్నించారు.

Karnataka: Police Lathi Charge at Davanagere for violation of eid milad peace resolution

అదే సమయంలో స్థానిక శాసన సభ్యుడు ఎస్. రామప్ప నేతృత్వంలో మరో వర్గం వారు అక్కడికి చేరుకుని జెండాలు, ఫ్లెక్సీలు తొలగించరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసమయంలో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు చెయ్యి చెయ్యి చేసుకోవడంతో పరిస్థితి విషమించింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆ సమయంలో పరిస్థితి చెయ్యిజారి పోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. హరిహర పట్టణంలో ఆదివారం వరకు పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

దావణగెరె ఎస్పీ హనుమంతరాయ, ఎఎస్పీ ఎం. రాజీవ్ తదితరులు సంఘటనా స్థలంలో మకాం వేశారు. అదనపు బలగాలను హరిహరాకు తరలించారు. ఇరు వర్గాల నాయకులతో పోలీసు అధికారులు శాంతి సభలు నిర్వహిస్తున్నారు.

English summary
Karnataka: The incident took place in Harihar Nagar, Davangere district, amidst two communal clashes over the evacuation of flag, buntings for the Eid Milad festival as violation of peace resolutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X