వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యమ రంజుగా రేవ్ పార్టీ: ప్రత్యేక యాప్: కాలేజ్ ఈవెంట్ పేరుతో..మామిడి తోటలో.. రాత్రంతా..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహిళలు, చిన్నపిల్లలపై దేశవ్యాప్తంగా అత్యాచారాలు, హత్యల ఘటనలు మితిమిరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అలాంటి అవాంఛనీయ సంఘటలను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యాపారులు. తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు. కళాశాల ఈవెంట్ పేరుతో ఏకంగా రేవ్ పార్టీలను ప్రోత్సహిస్తున్నారు. యువతులపై అత్యాచారాలను మరింత పెంచేలా అసాంఘిక కార్యక్రమాలకు తెర తీస్తున్నారు.

మాంసపు ముద్దలుగా: అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43: మరింత పెరిగొచ్చంటూ.. !మాంసపు ముద్దలుగా: అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43: మరింత పెరిగొచ్చంటూ.. !

 బడా నేతల కుమారులు ఉన్నట్లు..

బడా నేతల కుమారులు ఉన్నట్లు..

కర్ణాటకలోని రామనగర జిల్లాలో శనివారం రాత్రి నిర్వహించిన ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పలువురిని అరెస్టు చేశారు. రామనగర జిల్లాలోని విభూతిపుర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులకు సమాచారం అందడంతో.. జిల్లా ఎస్పీ అనూప్ షెట్టి స్వయంగా ఈ దాడిని నిర్వహించారు. కొందరు బడా నేతల కుమారులు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాలేజీ ఈవెంట్ పేరుతో..

కాలేజీ ఈవెంట్ పేరుతో..

బెంగళూరు నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ విభూతిపుర గ్రామం. బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి ఈ గ్రామంలో మామిడితోట, ఫామ్ హౌస్ ఉంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ మామిడితోటలో రాత్రి రేవ్ పార్టీని నిర్వహించారు. కాలేజీ ఈవెంట్ పేరుతో దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన పలువురు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

తమిళనాడు, కేరళ నుంచీ..

తమిళనాడు, కేరళ నుంచీ..

ఒక్క బెంగళూరు నుంచే కాకుండా, తమిళనాడు, కేరళల నుంచి పెద్ద ఎత్తున యువకులను రప్పించినట్లు చెబుతున్నారు. దీనికోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక యాప్ ను సైతం రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. యాప్ ద్వారా యువతీ, యువకులను రేవ్ పార్టీకి రప్పించారని అంటున్నారు. భారీ శబ్దాలతో డీజే సౌండ్ ను నిర్వహించడం, పెద్ద ఎత్తున వాహనాలు గ్రామానికి చేరుకోవడం, ఎప్పుడూ చూడని కొత్త ముఖాలు గ్రామంలో హల్ చల్ చేయడంతో విభూతిపుర గ్రామస్తులు అప్రమత్తం అయ్యారు. రాత్రి డీజే సౌండ్ లతో పరిసర ప్రాంతాలు మారుమోగేలా చేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్పీ సారథ్యంలో..

ఎస్పీ సారథ్యంలో..

గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు ధృవీకరించారు పోలీసులు. వెంటనే జిల్లా ఎస్పీ అనూప్ షెట్టికి సమాచారం ఇచ్చారు. సుమారు 500 మంది వరకు యువతీ, యువకులు ఉన్నట్లు తేలడంతో.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. రేవ్ పార్టీపై మెరుపుదాడి నిర్వహించారు. పోలీసులు వస్తోన్న సమాచారం తెలియడంతో పలువురు తప్పించుకుని పారిపోయారు. మరి కొందర్ని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో మధుమిత, పౌరాణిక పురోహిత్, నబీరా, రిచ్చు ఉన్నారు. వారి వద్ద నుంచి డీజే సౌండ్ బాక్సులు, షామియానా, కెమెరాలు, పలు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిపై కేసు నమోదు చేశారు. మామిడితోట యజమాని వెంకటేష్ పైనా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

English summary
Rave Party was busted at Vibhuthipura village in Ramanagara district of Karnataka. When got a tip of information by the villagers Ramanagara district SP Anup Shetty conducted a raid on the rave party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X