బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక పోలీస్ సింగం రాజీనామా.. నెక్ట్స్ రాజకీయాలేనా?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక పోలీస్ సింగంగా పేరుపొందిన బెంగళూరు సౌత్‌ డీసీపీ కె.అన్నామలై సర్వీస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ మేరకు హోంమంత్రి ఎంబీ పాటిల్‌ ఆధ్వర్యంలో సీఎం హెచ్‌డి కుమారస్వామిని మంగళవారం నాడు కలిసి తన రాజీనామా గురించి వివరించారు. అయితే తొందరపడొద్దని సీఎం సూచించినప్పటికీ ఆయన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. సీఎం సూచనను అన్నామలై సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

నిజాయితీ గల అధికారిగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన అన్నామలై రాజీనామా అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అయితే తన రాజీనామా విషయంలో ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదంటున్నారు. సీఎంను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. డ్యూటీలో ఇన్నాళ్లు సహకరించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట.. రోగమట..!తస్మాత్ జాగ్రత్త.. అది టైమ్ పాస్ కాదట.. రోగమట..!

Karnataka Police Singam Annamalai quits from Service may join politics

సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న అన్నామలైని.. కర్ణాటక పోలీస్ సింగంగా అభివర్ణిస్తారు. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నానని.. విధినిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేశానని.. ప్రజలకు సేవలందించే విషయంలో మంచి విజయాలే సాధించానని చెప్పుకొచ్చారు. అయితే రాజీనామా తర్వాత ఏం చేయబోతున్నారనే ప్రశ్నకు.. నాలుగు నెలల తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు.

అదలావుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అన్నామలై ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఆయన త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.

English summary
Bengaluru South Deputy Commissioner of Police K Annamalai, who is popularly known as Singam of Karnataka Police, quits from the service. While there is a speculation that he could take a plunge in politics, in a letter addressed to his friends and well-wishers, he has not revealed any such plan. He told that he may reveal his plan after four months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X