వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలు బహిష్కరిస్తామని సీఎంకు లేఖ రాసిన పోలీసులు, తలనొప్పి, రైట్ టైంలో ఝలక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మా సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలను బహిష్కరిస్తామని పోలీసులు పరోక్షంగా ఒత్తిడి చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు లేఖ రాయడంతో కలకలం రేపింది. పోలీసులు ఏకంగా సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు లేఖ రాయడంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !రోడ్లలో భారీ గుంతలు, ప్రధానికి లేఖ, అమ్మాయితో ఫోటోషూట్, వైరల్, షేమ్ షేమ్ !

వేతనాల తారతమ్యం విషయం వెంటనే పరిష్కరించాలని పోలీసులు సీఎం యడియూరప్ప మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రాఘవేంద్ర ఔరాద్కర్ నివేదికలోని లోటుపాట్లను పరిశీలించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కు పోలీసులు మనవి చేశారు.

Karnataka police write letter to CM Yediyurappa threatening to boycott by elections

తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 5వ తేదీ జరగనున్న ఉప ఎన్నికల్లో తాము ఓటు వెయ్యమని పోలీసులు అంటున్నారు. అయితే ఉప ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో తాము పాల్గొనమని పోలీసులు చెప్పకపోయినా ఆ రోజు వాళ్లు ఏం చేస్తారు ? మనం ఇప్పుడు ఏం చెయ్యాలి ? అనే విషయంపై సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజ్ బోమ్మయ్ అధికారులతో చర్చిస్తున్నారు.

ప్రముఖ నటి, ఎంపీ సుమలతో అమిత్ షా, సీఎం చర్చలు, ఉప ఎన్నికల్లో మద్దతు, క్లారిటీ!ప్రముఖ నటి, ఎంపీ సుమలతో అమిత్ షా, సీఎం చర్చలు, ఉప ఎన్నికల్లో మద్దతు, క్లారిటీ!

పోలీసు అధికారులు, పోలీసులను చర్చలకు పిలవాలని సీఎం యడియూరప్ప ఆలోచిస్తున్నారని తెలిసింది. రాఘవేంద్ర ఔరాద్కర్ నివేదిక పరిశీలించి మా సమస్యలు పరిష్కారించాలని, వేతాల తారతమ్యం సమస్యతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నాలుగవ శనివారం ఇస్తున్న సెలవును పోలీసులకు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న 10 సెలవు దినాలను 15 సెలవు దినాలుగా ప్రకటించాలని పోలీసులు సీఎం యడియూరప్పకు మనవి చేశారు. మొత్తం మీద కర్ణాటకలో ఉప ఎన్నికల వేడితో సతమతం అవుతున్న సీఎం యడియూరప్పకు పోలీసులు ఇప్పుడు మరో తలనొప్పిగా తయారైనారు.

English summary
Karnataka Police write letter to CM Yediyurappa that they boycott voting in by elections if government did not agree their demands regarding salary inequality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X