వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Karnatakaలో రొంబ రొమాన్స్: ఫ్రెండ్ భార్యపైనే రేప్ అటెంప్ట్ చేసిన మంత్రి..జార్కిహోళీ ఒక్కరే కాదు..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజకీయాలు కంపుకొడుతున్నాయి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేతలే తమ కామపురాణాలతో బయటపడుతున్నారు. రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్నాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి కామకేళితో ఒక్కసారిగా బీజేపీలో పెద్ద చర్చచు దారి తీసింది. ముందుగా వీడియోలో ఉన్నది తాను కాదని బుకాయించినప్పటికీ ఆ తర్వాత రాజీనామా చేశారు రమేష్ జార్కిహోళి. ఇక కామపురాణాల్లో కర్నాటక పొలిటీషియన్స్ అగ్రస్థానంలో ఉన్నారు. రమేష్ జార్కిహోళి కంటే ముందు మరికొందరు నేతల కామ కహానీలు ఏంటో ఓ లుక్కేద్దాం...

 మందు మగువ నా వీక్‌నెస్: మాజీ సీఎం

మందు మగువ నా వీక్‌నెస్: మాజీ సీఎం

ఎంతటి రసికుడవో తెలిసెరా.. అంటూ ముత్యాల ముగ్గు సినిమాలో పాట చాలా పాపులర్. ఆ పాట వింటే ఇప్పుడు మన కర్నాటక రాజకీయ నాయకులే గుర్తొస్తున్నారు. రమేష్ జార్కిహోళి కామక్రీడతో గతంలో కామ క్రీడల్లో మునిగి తేలిన పొలిటికల్ లీడర్స్ పేర్లను ఇప్పుడు పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం చాలా ధైర్యంగానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. అందులో ఒకరు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా చాలమందికి గుర్తు ఉండే ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత విస్కీ... ఆపై అమ్మాయిలు తన బలహీనత అని చెప్పుకొచ్చారు. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కట్ చేస్తే ఇప్పుడు రమేష్ జార్కిహోళి. తన కామకోరికలు తీరిస్తే ఉద్యోగం ఇస్తానంటూ ఓ మహిళను లోబర్చుకున్న వీడియో వైరల్ అయ్యింది.

ఫ్రెండ్ భార్యను కూడా వదలని హాలప్ప

ఫ్రెండ్ భార్యను కూడా వదలని హాలప్ప

ఇక పలువురు కర్నాటక పొలిటీషియన్స్ కూడా గతంలో ఇలాంటి కామక్రీడల్లో దొరికిన ఉదంతాలు కనిపిస్తాయి. పలు ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు కూడా ఉన్నారు. ఎంపీ రేణుకాచార్యపై జయలక్ష్మీ అనే నర్సు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా ఎంపీ వేధిస్తున్నారంటూ రాష్ట్ర మానవహక్కుల సంఘంకు ఫిర్యాదు చేసిన తర్వాత తనను చంపేస్తామంటూ రేణుకాచార్య బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు.అయితే చివరకు రేణుకాచార్య తన పదవికి రాజీనామా చేశారు. 2009లో తన స్నేహితుడి భార్యపై అత్యాచారం పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు బీజేపీ నేత మాజీమంత్రి హర్తాలు హాలప్ప. ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ప్రజా దేవాలయంలో పోర్న్ వీడియోలా..

ప్రజా దేవాలయంలో పోర్న్ వీడియోలా..

ఇక ప్రజాదేవాలయంగా భావించే అసెంబ్లీలో 2012లో ముగ్గురు నేతలు ఏకంగా ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తు పట్టుబడిన ఘటన సంచలనం రేపింది. లక్ష్మణ్ సవాడి, సీసీ పాటిల్, కృష్ణ పాలెమార్‌లు వీడియోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. అయితే దీనిపై విచారణ జరిపిన అప్పటి హోంశాఖ వీరి తప్పులేదంటూ రిపోర్టు ఇచ్చింది. ప్రస్తుతం లక్ష్మణ్ సవాడి యడియూరప్ప కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక 2016లో అప్పటి మంత్రిగా ఉన్న హైమేతికి సంబంధించిన సెక్స్ వీడియో బయటకు లీక్ కావడంతో ఆయన కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఫేక్ వీడియోకు అరవింద్ బలి

ఫేక్ వీడియోకు అరవింద్ బలి

2019 జూలైలో బీజేపీ నేత మహదేవపురా ఎమ్మెల్యే అరవింద్ లింబావాలి పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఓ వీడియో సర్క్యులేట్ కావడంతో నిండు అసెంబ్లీలో ఆయన కుప్పకూలారు. అది తప్పుడు వీడియో అని అందులో ఉన్నది తను కాదని స్పష్టం చేశారు. అయితే డిసెంబర్ 2019లో ఫోరెన్సిక్ శాఖ నివేదిక ఇచ్చింది. ఆ వీడియో ఫేక్ వీడియో అని స్పష్టం చేసింది. కానీ అప్పటికే అరవింద్ పరువు ప్రతిష్ట మంటకలిశాయి.

English summary
Sex scandals have rocked Karnataka Politics in the past and Ramesh Jarkiholi is not the first politician to be booked in sex scandals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X