వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3న యెడ్యూరప్ప గడ్డ శిమోగాలో రాహుల్ రోడ్‌షో: లింగాయత్‌లపై సందిగ్ధంలో అమిత్‌షా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : రాహుల్ గాంధీ రోడ్ షో కు రంగం సిద్ధం

శివమొగ్గ: కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ సన్నద్ధం అవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శివమొగ్గ జిల్లా పరిధిలో మహా రోడ్ షో విజయవంతంగా నిర్వహించిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిగా శివమొగ్గ జిల్లా పరిధిలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించాలని సంకల్పించింది.
అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల మూడో తేదీన రాహుల్ గాంధీ రోడ్ నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ రోడ్ షో నిర్వహణకు కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని కమిటీ రాహుల్ రోడ్ షోను ఖరారు చేసింది.

హొన్సాలీ మీదుగా దావణగిరె వరకు రాహుల్ రోడ్ షో

హొన్సాలీ మీదుగా దావణగిరె వరకు రాహుల్ రోడ్ షో

ఏఐసీసీ, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మూడో తేదీన మధ్యాహ్నం 11.30 గంటలకు జిల్లా కేంద్రం శివమొగ్గ నగరంలో అడుగు పెడుతూనే రోడ్ షోకు శ్రీకారం చుడతారు. హొన్నాలీ మీదుగా దవణగెరె వరకు రాహుల్ రోడ్ షో సాగుతుంది. శివమొగ్గ జిల్లా బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప సొంత గడ్డ కావడంతో రాహుల్ గాంధీ రోడ్ షోకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వ ప్రతిభతోపాటు దేశ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారిన కర్ణాటకలో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరొకసారి బీజేపీ గెలుపొందడం ఆనవాయితీగా కనిపిస్తున్నది.

2013లో కాంగ్రెస్ పార్టీకి ఓటు 2014లో బీజేపీకి అండ

2013లో కాంగ్రెస్ పార్టీకి ఓటు 2014లో బీజేపీకి అండ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు మధ్య ఏడాది సమయం మాత్రమే ఉన్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 2014 లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రాతిపదికన బీజేపీ పట్టు సాధించింది. అంతకు ముందు 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 1989 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పరస్పర విరుద్ధంగా వచ్చాయి. అదే పరిస్థితి 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2014లో అత్యధికంగా 17 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుపొందింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకున్నది.

2014లో బీజేపీకి 132 సెగ్మెంట్లలో ఆధిక్యం

2014లో బీజేపీకి 132 సెగ్మెంట్లలో ఆధిక్యం

రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 122, బీజేపీ, జేడీఎస్ చెరో 40 స్థానాలను గెలుచుకున్నాయి. కానీ 2014 లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 132 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధిస్తే, కాంగ్రెస్ పార్టీ 77, జేడీఎస్ 15 సెగ్మెంట్లలో ఆధిక్యం కనబరిచాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలతో పోలిస్తే మూడు రెట్లకు పైగా కమలనాథులు పట్టు సాధించారు. 2013లో 20 శాతం ఓట్లు పొందిన బీజేపీ 2014లో 43 శాతం ఓట్లను ఒడిసి పట్టింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం కూడా 2013తో పోలిస్తే 2014లో 37 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్ల ఆధిక్యత స్వల్పంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ లబ్ధి పొందింది.

2014 యెడ్యూరప్ప, శ్రీరాములు రాకతో బీజేపీకి 12.5 శాతం ఓట్లు

2014 యెడ్యూరప్ప, శ్రీరాములు రాకతో బీజేపీకి 12.5 శాతం ఓట్లు

2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అంతకుముందు పార్టీని వీడిన బీఎస్ యెడ్యూరప్ప, బీ శ్రీరాములు తిరిగి పార్టీ గూటికి చేరడం వల్లే 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెంచుకున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్ యెడ్యూరప్ప సొంతంగా కర్ణాటక జనతా పక్ష (కేజేపీ), బీ శ్రీరాములు.. బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు మరి. బీజేపీ ఓట్లు రెండు పార్టీలుగా చీలడంతో ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. కానీ 2014 ఎన్నికల్లో యెడ్యూరప్ప, శ్రీరాములు తిరిగి రావడంతో కమలం పార్టీకి 12.5 శాతం ఓట్లు పెరిగాయి.

బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి దేవెగౌడ పయనం ఇలా

బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి దేవెగౌడ పయనం ఇలా

మరోవైపు మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) ఓటు బ్యాంకు మాత్రం కొడిగట్టిపోయింది. 2013 ఎన్నికల్లో 20 శాతానికి పైగా ఓట్లు పొందిన జేడీఎస్.. 2014లో 11 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహంలో ప్రధాన ఆకర్షణ మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప కావడం గమనార్హం. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం కూడా దీనికి కారణం. అయితే లింగాయత్ ఓట్లను చీల్చే లక్షంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం వారికి మైనారిటీ మత హోదా కల్పించాలని ప్రతిపాదించింది. మరోవైపు బీజేపీ యెడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం 2013, 2014 నాటి ఫలితాలకు ప్రతిరూపాలుగా మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాల్లో రెండవది. కాంగ్రెస్, బీజేపీ తర్వాత స్థానంలో ఉన్న జేడీఎస్ ఇప్పటికే 126 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని జేడీఎస్ ముందుకు సాగుతున్నది.

లింగాయతుల్ని అల్పసంఖ్యాకులుగా గుర్తించాలన్న శ్రీ మురుఘ రాజేంద్ర మఠాధిపతి

లింగాయతుల్ని అల్పసంఖ్యాకులుగా గుర్తించాలన్న శ్రీ మురుఘ రాజేంద్ర మఠాధిపతి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇలాంటి ధర్మ సంకటంలో పడ్డారు. వివిధ కారణాలతో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి సిద్ధాంతాలకు లోబడి జీవిక సాగించే వీరశైవులు, లింగాయతుల్ని మత అల్పసంఖ్యాకులుగా గుర్తించింది. దీన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీరశైవులు, లింగాయతుల్లో అత్యధికులు బీజేపీ మద్దతుదార్లు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని నివారించేందుకు అమిత్‌ షా సోమ, మంగళవారాల్లో ప్రజల్ని బాగా ప్రభావితం చేసే లింగాయత, వీర శైవ మఠాల్లో కీలకమైన 40 కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల్లో కమలనాథుల్ని కరుణించాలని వాటి పీఠాధిపతులకు విన్నవించారు.

లింగాయత్‌లను అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించాలని అమిత్ షాకు లేఖ

లింగాయత్‌లను అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించాలని అమిత్ షాకు లేఖ

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా దర్శించిన మఠాల్లో చిత్రదుర్గ నగరంలోని శ్రీ మురుఘ రాజేంద్ర మఠం కూడా ఒక్కటి. మఠాధిపతి శివమూర్తి శరుణుల వారితో అమిత్‌ షా, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యెడ్యూరప్ప, మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మురళీధరరావు తదితరులు మంతనాలు జరిపారు. పరస్పర అభివాదం తర్వాత అమిత్‌ షా నిష్క్రమిస్తున్నపుడు ఆయన చేతిలో శివమూర్తి శరణులు పెట్టిన లేఖే ఇప్పుడు కమలనాథులకు కంటక ప్రాయంగా మారింది. లింగాయతుల్ని మత అల్పసంఖ్యాకులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన సిఫార్సును ఆమోదించేందుకు కృషి చేయాలని శివమూర్తి శరణులు కోరారు. మత అల్ప సంఖ్యాకులుగా గుర్తిస్తే లింగాయతుల్లో విడిపోయిన ఉపకులాలు మళ్లీ ఏకతాటికి వచ్చి సంఘటితం అవుతాయని, ఒకే మతస్తులుగా ఆవిర్భవిస్తారని స్వామీజీ విన్నవించారు.

వీరశైవులు, లింగాయత్‌ల విభజనను అంగీకరించమన్న అమిత్ షా

వీరశైవులు, లింగాయత్‌ల విభజనను అంగీకరించమన్న అమిత్ షా

లింగాయతుల్లోని యువకులు, విద్యార్థులకు వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేసిన లేఖలో శ్రీ మురుఘ రాజేంద్రమఠం పీఠాధిపతి శివమూర్తి శరుణులు విపులీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైందని మెచ్చుకున్నారు. శ్రీ మురుఘ రాజేంద్రమఠం పీఠాధిపతి వైఖరితో కంగుతిన్న అమిత్‌ షా సరే.. చూస్తామని ముక్తసరిగా బదులిచ్చి వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసును తిరస్కరిస్తామని, వీరశైవులు, లింగాయతులు ఒక్కరైనందున విభజించేందుకు అంగీకరించబోమని అమిత్‌షా పలుమార్లు బహిరంగ వేదికలపై పేర్కొనటం ఇక్కడ ప్రస్తావనార్హం. శివమూర్తి శరణులు అమిత్‌ షాకు సమర్పించిన ‘ఉత్తర' సమాచారం బుధవారం వెలుగు చూసింది. తనకు తెలిసింత వరకూ శివమూర్తి శరణులు అటువంటి మాదిరి లేఖను అమిత్‌ షాకు ఇవ్వలేదని యెడ్యూరప్ప బుధవారం మధ్యాహ్నం ఇక్కడ మీడియాతో అన్నారు.

English summary
SHIVAMOGGA: After the visit by national BJP president Amit Shah and the grand roadshow, the district congress is also gearing up to put up a road show for AICC president Rahul Gandhi’s visit to the city. DK Shivakumar, energy minister and president of KPCC state campaigning committee, decided about the AICC president’s arrival. As per the scheduled visit, Rahul Gandhi will arrive to the city on April 3 at 11.30 and it will follow with a road show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X