వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరి గుడిసెలో పోలీస్ అధికారి.. అవ్వ ఇచ్చిన రొట్టె తిని.. నెట్టింట వైరల్..!

|
Google Oneindia TeluguNews

రాయచూరు : ఐపీఎస్ అధికారి.. ఓ జిల్లాకు ఎస్పీ. సార్ తలచుకుంటే ఏదైనా ఆయన ముంగిటకు రావాల్సిందే. కానీ, ఆయన వ్యక్తిత్వం అలా కాదు. పోలీస్ అధికారులు అనగానే తిడతారు, కొడతారనే మచ్చను ఆయన తుడిపేస్తున్నారు. పోలీసులంటే ఇలా కూడా ఉంటారా అనే తీరుగా ఆయన వ్యక్తిత్వం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎస్పీ వేదమూర్తి రూటే సెపరేటు. జనాలతో కలిసి పోవడం ఆయన స్టైల్. ఎస్పీ అనే అధికార దర్పం లేకుండా ప్రజల మనిషిగా ఉండాలని అనుకుంటారు. ఆ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో కొంతమంది కలిసి స్వచ్ఛతా అనే కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా మాన్వి తాలూకా కుర్ధి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ గ్రామంలో పురాతన కాలం నాటి పాడుబడ్డ బావిని శుభ్రం చేయించి దాని చుట్టూ మొక్కలు నాటించారు.

గలీజు దందాలకు వాట్సాప్.. హైటెక్ వ్యభిచారం.. మందుబాబుల తతంగం..!గలీజు దందాలకు వాట్సాప్.. హైటెక్ వ్యభిచారం.. మందుబాబుల తతంగం..!

 karnataka raichur sp vedamurthy ate roti in hut viral photo

కుర్ది గ్రామంలో సదరు ఎస్పీ యాక్టివ్‌గా తిరుగుతున్న క్రమంలో పాపమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఆయనకు తారసపడ్డారు. ఆ క్రమంలో ఆయనకు నమస్కారం చేసింది. దానికి ప్రతిగా బాగున్నావా అమ్మ అంటూ ఆయన ఎదురు పలకరించారు. ఆమె యోగ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అయితే ఉదయం నుంచి గ్రామంలో తిరుగుతున్నారు కదా.. ఏమైనా తిన్నారా అంటూ ఆ పెద్దావిడ ఎస్పీని అడిగారు.

దాంతో ఆయన ఏదైనా ఉంటే పెట్టమ్మా అని కోరడంతోనే పూరి గుడిసెలోకి తీసుకెళ్లి జొన్న రొట్టెతో పాటు శనగ పిండి కూర ఆయనకు అందించారు. ఆ క్రమంలో ఆమె ఇచ్చిన ఆ అల్పాహారం తిని అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురి చేశారు ఎస్పీ. అయితే దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట బాగా చక్కర్లు కొడుతుండటంతో వైరల్‌గా మారింది.

English summary
karnataka raichur sp vedamurthy ate roti in hut viral photo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X