బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక బంద్: బెంగళూరులో హై అలర్ట్, ఆసుపత్రులు, క్లీనిక్ లు, సినిమాలు, కేఎస్ఆర్ టీసీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Bandh in Hubli, Dharwad, Belgaum : హుబ్బళి లో సంపూర్ణ బంద్

బెంగళూరు: మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో గోవా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం (జనవరి 25) కర్ణాటక బంద్ కు కన్నడ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

గోవా vs కర్ణాటక

గోవా vs కర్ణాటక

మహాదాయి నదీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన గోవాలోని బీజేపీ- కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాదాయి నదీ నీటిని తీసుకు వచ్చి హుబ్బళి-దారవాడ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రజలకు తాగు నీరు అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కన్నడ

కన్నడ

కన్నడ చళువళి వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ నేతృత్వంలో జరుగుతున్న బంద్ కు 2,000 కన్నడ సంఘ, సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాలో సంపూర్ణంగా బంద్ జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.

సినీరంగం మద్దతు

సినీరంగం మద్దతు

స్యాండిల్ వుడ్ ప్రముఖులు కన్నడ సంఘాలు, రైతులు నిర్వహిస్తున్న బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అన్ని సినిమా థియేటర్లు మూతపడుతున్నాయని, సీనిమా షూటింగ్ లు నిలిపివేసి నటీనటులు బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నారని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా. గోవింద్ బుధవారం మీడియాకు చెప్పారు.

మా మద్దతు, రైలురోకో

మా మద్దతు, రైలురోకో

గురువారం జరుగుతున్న బంద్ కు మా మద్దతు ఉంటుందని, రైలురోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు కన్నడ సంఘ, సంస్థలు, కేఎస్ఆర్ టీసీ సంస్థ, డ్రైవర్లు సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించారు.

బెంగళూరులో హై అలర్ట్

బెంగళూరులో హై అలర్ట్


కర్ణాటక బంద్ సందర్బంగా బెంగళూరు నగరంలో భారీ ర్యాలీలు, ధర్నాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు పోలీసులు, సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు.

సున్నితమైన ప్రాంతాల్లో !

సున్నితమైన ప్రాంతాల్లో !

గతంలో బంద్ సందర్బంగా జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు. గోవా, మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చే వాహనాలను చెక్ పోస్టుల దగ్గరే నిలిపివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆసుపత్రులు, క్లీనిక్ లు

ఆసుపత్రులు, క్లీనిక్ లు


బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక మొత్తం ఆసుపత్రులు, క్లీనిక్ లు నిర్వహించడానికి బంద్ నిర్వహకులు అనుమతి ఇచ్చారు. అంబులెన్స్ లు ఎక్కడా అడ్డుకోరాదని, పాలు, పూల దుకాణాలు తీసినా వారిని ఏమీ మాట్లాడకూడదని బంద్ నిర్వహకులు సూచించారు.

English summary
Karnataka Rakshana Vedike president T.A. Narayana Gowda extended support for Karnataka bandh called on January 25, 2018. Kannada organizations called for Karnataka bandh demanding for state and central governments to resolve the Mahadayi water sharing dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X