బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్ కాలా సినిమాకు కావేరీ కష్టాలు, విడుదల కానివ్వం: కన్నడిగులు, ఫ్యాన్స్ ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటకలో 'కాలా' విడుదల కానివ్వం అంటున్న కన్నడిగులు

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యరాదని గత వారం రోజుల నుంచి కర్ణాటకలో ఆందోళనలు చేస్తున్నారు. కావేరి నీటి విషయంలో కన్నడిగులను కించపరుస్తూ కర్ణాటక రాష్ట్రానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న రజనీకాంత్ కాలా సినిమాను విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం బెంగళూరులో కర్ణాటక రక్షణా వేదిక ధర్నా నిర్వహించింది. కాలా సినిమా విడుదల చెయ్యాలని రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు.

చలన చిత్ర వాణిజ్య మండలి

చలన చిత్ర వాణిజ్య మండలి

రజనీకాంత్ హీరోగా నటించిన కాలా సినిమా వచ్చే వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ శనివారం కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ముందు కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రజనీకాంత్ కన్నడ ద్రోహి

రజనీకాంత్ కన్నడ ద్రోహి

కర్ణాటకలో పుట్టి తమిళనాడులో స్థిరపడిన రజనీకాంత్ కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆయన కన్నడిగుల వ్యతిరేకి అని ప్రవీణ్ కుమార్ శెట్టి ఆరోపించారు. రజనీకాంత్ నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల కానివ్వమని ప్రవీణ్ కుమార్ శెట్టి హెచ్చరించారు.

కాలాను అడ్డుకోలేం

కాలాను అడ్డుకోలేం

కాలా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ కుమార్ శెట్టి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా. గోవింద్ కు వినతిపత్రం ఇచ్చారు. కాలా సినిమా కర్ణాటక పంపిణిదారులు, సినిమా థియేటర్ల యాజమాన్యం సినిమా విడుదల చేసే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ సందర్బంలో తాము నేరుగా సినిమా విడుదలను నిషేదించలేమని సా,రా. గోవింద్ అంటున్నారు.

రంగంలోకి రజనీ ఫ్యాన్స్

రంగంలోకి రజనీ ఫ్యాన్స్

సౌత్ ఇండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా కర్ణాటకలో విడుదల చెయ్యడానికి అవకాశం కల్పించాలని రజనీకాంత్‌ అభిమాన సంఘాలు మనవి చేస్తున్నాయి. రజనీకాంత్ అభిమానుల సంఘం కర్ణాటక నాయకులు సదానందస్వామి, సంతోష్ తదితరులు కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సా.రా. గోవింద్ కు మనవి చేశారు.

ప్రపంచం మొత్తం

ప్రపంచం మొత్తం

ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే కాలా సినిమాను కేవలం కర్ణాటకలో అడ్డుకోవడం సరికాదని, రజనీకాంత్ ను నటుడిగా మాత్రమే చూడాలని ఆయన అభిమానులు కన్నడిగులకు మనవి చేస్తున్నారు. కాలా సినిమా కర్ణాటకలో విడుదల అవుతోందని రజనీకాంత్ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.

English summary
Karnataka Rakshana Vedike is protesting against the release of Rajanikanth's Kaala Cinema. The Karnataka film industry is upset with Rajinikanth's reported statement that whichever government comes to power in Karnataka, it should implement the Supreme Court order on Cauvery water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X