బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుప్రీం కోర్టును ఆశ్రయించిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, రాజీనామాలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తాము రాజీనామాలు చేసినా వాటిని అంగీకరించకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలు పరిశీలించిన స్పీకర్ రమేష్ కుమార్ ఐదు మంది రాజీనామాలు చట్టబద్దంగా ఉన్నాయని, మిగిలిన 8 మంది రాజీనామాలు చట్టబద్దంగా లేవని ఇప్పటికే స్పష్టం చేశారు.

Karnataka rebel Congress and JDs MLAs move to Supreme Court against Speaker

తాము చట్టబద్దంగా రాజీనామాలు చేసినా స్పీకర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించి వాటిని ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ జులై 10వ తేదీ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

రెబల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్టగి వాదనలు వినిపించనున్నారు. తన కార్యాలయంలో తన కార్యదర్శికి 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలు ఇచ్చారని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఇప్పటికే మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణగౌడ, రామలింగా రెడ్డి, గోపాలయ్యల రాజీనామాలు చట్టబద్దంగా ఉన్నాయని, మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు చట్టబద్దంగా లేవని, న్యాయనిపుణుల సలహా తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ అంటున్నారు.

కర్ణాటక శాసన సభలో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో జులై 10వ తేదీ నాటికి బలాబలాలు

* మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య: 211
* కాంగ్రెస్: 69
* జేడీఎస్: 34
* కాంగ్రెస్+జేడీఎస్: 104
* బీజేపీ 106 (స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే హెచ్. నాగేష్ తో కలిపి)
* బీఎస్ పీ: 1
* స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు: (కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే శంకర్)

English summary
Karnataka rebel Congress and JD(S) leaders who have resigned from Assembly, move Supreme Court accusing the Speaker of abandoning his constitutional duty and deliberately delaying acceptance of their resignations. Supreme Court to hear the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X