వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో హంగ్!: జేడీఎస్‌తో బీజేపీ-కాంగ్రెస్ నేతల మంతనాలు, కుదరకుంటే చీలిక?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందని దాదాపు తేలిపోయింది. బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి ఫలితాల సరళి చూస్తే త్రిశంకు స్వర్గం వస్తుందని దాదాపు ఖాయమైంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలు: ఎప్పటికప్పుడు... మరిన్ని వివరాల ఇక్కడ చూడండి

బీజేపీ 91 స్థానాల్లో, కాంగ్రెస్ 82 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ నలభై స్థానాలు, కాంగ్రెస్ నూటా ఇరవై రెండు స్థానాలు, జేడీఎస్ నలభై స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగులుతోంది.

Karnataka results:BJP may single largest party in a hung house

హంగ్ పరిస్థితి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నేతలు జేడీఎస్‌తో మంతనాలు జరుపుతున్నారు. అధికారాన్ని చేపట్టేందుకు పార్టీలు తగిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటు కుదరని పక్షంలో అతి తక్కువ బలమున్న రాజకీయ పక్షాన్ని చీల్చేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వెనుకంజ వేయబోవనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రజా వ్యతిరేకత తగులుతోంది. ఆయన ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చాముండేశ్వరిలో ఓటర్లు నిరూపిస్తున్నారు. ఇక్కడ మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. తన సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌కు చెందిన జీడీ దేవెగౌడపై సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు.

సిద్ఱరామయ్య పోటీపడిన మరో నియోజకవర్గం బాదామిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురవుతోంది. గుల్బర్గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో, మధ్య కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ హవా కొనసాగుతుండగా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ గాలి వీస్తోంది.

ఇదిలా ఉండగా, ఈసీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం తొమ్మిదిన్నర గంటల సమయానికి బీజేపీ 58 స్థానాల్లో, కాంగ్రెస్ 27 స్థానాల్లో, జేడీఎస్ 24 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

English summary
EC official trends shows BJP leading on 58 seats,Congress leading on 27 seats, JDS on 24 and others on 3 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X