• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క‌ర్ణాట‌క‌లో కాంగ్రేస్ పీఠం నిల‌బెట్ట‌గ‌ల‌దా

|

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో సంపూర్ణ మ‌ద్ద‌త్తు సాదించ‌క‌పోయిన‌ప్ప‌టికి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని బీజేపి పేర్కొన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని కాంగ్రేస్ పార్టీ అంటోంది. కుమార స్వామి తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌టు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరుతున్నారు కాంగ్రేస్ నేత‌లు. జేడీయ‌స్ చీఫ్ తో ఇప్ప‌టికే మ‌మ‌తా బెన‌ర్జీ, మాయావ‌తి క‌లిసి ప‌నిచేసే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపి రాజ్యంగా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌జా స్వామ్యాన్ని ప‌రిర‌క్షించాల‌ని ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రేస్ మాజీ చీఫ్ సోనియా గాందీ బాద్య‌త‌ల‌ను బుజాన వేసుకుంటే కర్ణాట‌క‌లో మ‌ళ్లీ పాగా వెయ్య‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని కాంగ్రేస్ నేత‌లు అభిప్రాయప‌డుతున్నారు.

నైతిక విలువ‌ల‌కు బీజేపి క‌ట్టుబ‌డి ఉంటుందా

నైతిక విలువ‌ల‌కు బీజేపి క‌ట్టుబ‌డి ఉంటుందా

క‌ర్ణాట‌క రాజ‌కీయం ర‌సకందాయంలో ప‌డింది. క‌ర్ణాట‌క సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి సంపూర్ణ‌ మెజారిటీ రాక‌పోవ‌డంతో రాజ‌కీయ పార్టీలు సందిగ్దంలో ప‌డ్డాయి. మొత్తం 222 అసెంబ్లీ స్థానాల‌కు గాను బీజేపి 104, కాంగ్రేస్ 78, జెడీయ‌స్ 38, ఇత‌రులు రెండు స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. పూర్తి మెజారిటీ పొందాలంటే భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇంకా 9మంది అభ్య‌ర్ధుల మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉంటుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉన్న ప‌ళంగా 9మంది అభ్య‌ర్థుల‌ను కూడగ‌ట్టుకోవాలంటే బీజెపికి క‌త్తి మీద సామే. అత్య‌దిక సీట్లు సాదించిన ఏకైక అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన బీజెపి కి మెజారిటీ నిరూపించుకునే దిశాగా గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో మెజారిటీ నిరూపించుకోవ‌డం క‌ష్ట‌మైతే కాంగ్రేస్ పార్టీకి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జేడీయ‌స్ తో ఇప్ప‌టికే మంత‌నాలు నెర‌పుతున్న కాంగ్రేస్ కి ఆ పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి బ‌ల నిరూప‌ణ చేసుకావాల్సి ఉంటుంది. అందుకోసం కాంగ్రేస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ రంగంలో కి దిగారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రించాలంటూ దేవ‌గౌడ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అంతే కాకుండా మ‌మ‌తా బెన‌ర్జీ, మాయావ‌తి కూడా జెడీయ‌స్ చీఫ్ కుమార స్వామితో ప్ర‌భుత్వం ఏర్ప‌టు పై సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

 మెజారిటీ లేకున్నా ప్ర‌భుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటున్న కాంగ్రేస్

మెజారిటీ లేకున్నా ప్ర‌భుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటున్న కాంగ్రేస్

కాగా మాజిక్ ఫిగ‌ర్ కు 9 మంది అభ్య‌ర్ధుల మ‌ద్ద‌త్తు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు త‌గిన సంఖ్యాబ‌లం ఉంద‌ని, అవ‌కాశం ఇస్తే నిరూపించుకుంటామ‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోర‌డం సంచ‌ల‌నంగా మారింది. జెడీయ‌స్ లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌త్తు త‌మ‌కు ఉంద‌ని యెడ్యూరప్ప చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అభ్య‌ర్థుల గెలుపోట‌ములు ఖ‌రార‌య్యి మూడు గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే త‌మ‌కు ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల మ‌ద్ద‌త్తు ఉంద‌ని ప్ర‌క‌టించ‌డం సందేహాల‌కు తావిస్తోంది క‌ర్ణాట‌క కాంగ్రేస్ నేత‌లు వాఖ్య‌నిస్తున్నారు. రాజ్యంగ‌ బ‌ద్దంగా మెజారిటీ నిరూపించుకుని ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేస్తే ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు కాంగ్రేస్ నాయ‌కులు.

 ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌టు చేసే హ‌క్కు కాంగ్రేస్, జేడియ‌స్ ల‌కు ఉంది

ప్ర‌భుత్వాన్ని ఏర్ప‌టు చేసే హ‌క్కు కాంగ్రేస్, జేడియ‌స్ ల‌కు ఉంది

కాంగ్రేస్ నుంచి గెలిచిన 78మంది ఎమ్మెల్యేల‌ను, జేడీయ‌స్ నుండి గెలిచిన 38మంది ఎమ్మెల్యేల‌ను ఎలాంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా కాపాడుకోగ‌లిగితే కాంగ్రేస్ పార్టీ జేడీయ‌స్ తో క‌లిసి మ‌ళ్లీ ప్ర‌భ‌త్వం ఏర్పాటు చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. కాగా గ‌వ‌ర్న‌ర్ బీజెపికి బ‌ల నిరూప‌ణ కోసం ఇచ్చే స‌మ‌యాన్ని బ‌ట్టి, కాంగ్రేస్ - జేడీయ‌స్ ఎమ్మెల్యేల ధోర‌ణి బ‌ట్టి ఏ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అనే అంశం ఆధార ప‌డి ఉంటుంది. గ‌తంలో జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రిణామాలు పున‌రావ్రుత్తం ఐతే కాంగ్రేస్ పార్టీకి శ్రుంగ‌బంగం త‌ప్ప‌దు. మ‌ణిపూర్, గోవా లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజెపి సంపూర్ణ మెజారిటీ సాధించ‌న‌ప్ప‌టికి ఆ రెండు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేయ‌గ‌లిగారు. అదే వ్యూహం క‌ర్ణాట‌క‌లోనూ అమ‌లు చేస్తే మాత్రం జెడీయ‌స్ తో పాటు పాటు కాంగ్రేస్ పార్టీకి నిరాశ త‌ప్ప‌దు. కాగా మ‌ణిపూర్, గోవా ప‌రిస్థితుల‌కు ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు తేడా ఉంద‌ని కాంగ్రేస్ నేత‌లు చెప్తున్నారు. ప్ర‌జా స్వామ్యాన్ని ఖూనీ చేయ‌కుండా, రాజ్యాంగ బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రింస్తే బీజేపి కి హుందాగా ఉంటుద‌ని కాంగ్రేస్ నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

సోనియా చ‌తుర‌త చూపాలి

సోనియా చ‌తుర‌త చూపాలి

అంతే కాకుండా సోనియా గాంధీ రంగంలో దిగి ఇటు కాంగ్రేస్ ఎమ్మెల్యేల‌ను, అటు జెడీయ‌స్ ఎమ్మెల్యేల‌ను ల‌క్ష‌ణ‌రేఖ దాట‌కుండా కాపాడుకోగ‌లిగితే అదికారం త‌ద్యంలా క‌న‌ప‌డుతోంది. అదికార పార్టీ న‌జ‌రానాలు కాద‌ని, ప‌ద‌వీ వ్యామోహాలు లేవ‌ని పార్టీ మూల సిద్దాంతాల‌కు క‌ట్టుబ‌డి ఎంత‌మంది ప్ర‌జాప్ర‌తినిదులు ఉంటారో వారం రోజుల్లో తేలిపోతుంది. అన్నిటిక‌న్నా ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేల‌ను భ‌ద్రంగా కాపాడుకుని అర్థ‌బ‌లం క‌న్నా ఐదేళ్ల ప్ర‌జా సేవ గొప్ప‌ద‌ని న‌మ్మించ‌గ‌లిగితే, ఒప్పించి మెప్పించ‌గ‌లిగితే క‌ర్ణాట‌క పీఠం ముమ్మాటికి కాంగ్రేస్ పార్టీదే అవుతుంది.

English summary
BJP to form government in Karnataka, Congress also trying to form government, Karnataka results disappointed both bjp and congress parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X