వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం: రంగంలోకి సోనియా, ఆఫర్‌కు దేవేగౌడ ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిమిష నిమిషానికి పరిస్థితులు మారుతున్నాయి. హంగ్ దిశగా ఫలితాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. ఆమె జేడీఎస్ అధినేత దేవేగౌడతో ఫోన్లో మాట్లాడారు.

కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సోనియా గాంధీ స్వయంగా అంగీకరించారని తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ... జేడీఎస్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తుంది. అప్పుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఒప్పందానికి కాంగ్రెస్ సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.

కర్నాటకలో బీజేపీకి షాక్, ఊహించని మలుపు: మళ్లీ హంగ్ దిశగా..కర్నాటకలో బీజేపీకి షాక్, ఊహించని మలుపు: మళ్లీ హంగ్ దిశగా..

Karnataka results: Sonia Gandhi spokes Deve Gowda, JDS-Congress government in Karnataka

దేవేగౌడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌కు ఓకే చెప్పారని తెలుస్తోంది. తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాము సిద్ధమని చెప్పారని తెలుస్తోంది. దేవేగౌడ పార్టీ నేతలను పిలిపిస్తున్నారు. ఇది అనూహ్య పరిణామమే. మొత్తానికి కర్నాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చినా కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, యెడ్యూరప్ప నివాసం వద్ద పరిస్థితి మారిపోయింది.

English summary
Karnataka election results 2018: bjp is leading still hope for congress know how.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X