వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కుమారస్వామికి సినిమా కష్టాలు, అక్రమ మైనింగ్, సుప్రీంలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జంతకల్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలకు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సినిమా కష్టాలు మొదలైనాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలో సిట్ అధికారులు సుప్రీం కోర్టులో నివేదిక సమర్పించడానికి సిద్దం అయ్యారని సమాచారం.

నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!

2007లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హెచ్.డి. కుమారస్వామి జంతకల్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలకు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు రావడంతో కర్ణాటక లోకాయుక్త కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

సుప్రీం కోర్టు ఆదేశం

సుప్రీం కోర్టు ఆదేశం

జంతకల్ అక్రమ మైనింగ్ తవ్వకాలకు సీఎం హోదాలో 2007లో హెచ్.డి. కుమారస్వామి అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక లోకాయుక్తలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది.

గనుల శాఖ అభ్యంతరం

గనుల శాఖ అభ్యంతరం

చిత్రదుర్గ జిల్లాలోని పట్టా భూమిలో జంతకల్ మైనింగ్ కంపెనీ అక్రమంగా గనుల తవ్వకాలు చేపట్టిందని ఆరోపణలు ఉన్నాయి. పట్టా భూమిలో గనుల తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదని గునులు, భూగర్బ జలాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం జంతకల్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలకు అక్రమంగా అనుమతి ఇచ్చిందని కేసు నమోదు అయ్యింది.

పట్టించుకోని సీఎం ?

పట్టించుకోని సీఎం ?


జంతకల్ మైనింగ్ కంపెనీ గనుల తవ్వకాలు కొనసాగిస్తే పరిసర ప్రాంతాలు హానికి గురౌతాయని, స్థానికులకు ఇబ్బందులు ఎదురౌతాయని గనులు, భూగర్బ జలాల శాఖ అధికారులు హెచ్చరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వాటికి విరుద్దంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

జస్టిస్ సంతోష్ హెగ్డే

జస్టిస్ సంతోష్ హెగ్డే


అప్పటి లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే సైతం అక్రమంగా జంతకల్ కంపెనీ గనుల తవ్వకాలకు అనుమతి ఇచ్చారని నివేదిక తయారు చేశారు. లోకాయుక్త నివేదిక ఆధారంగా ప్రముఖ న్యాయవాది వినోద్ కుమార్, ఆర్ టీఐ కార్యకర్త టీజే. అబ్రహాం లోకాయుక్తకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

 మాజీ సీఎం బచావ్

మాజీ సీఎం బచావ్

టీజే. అబ్రహాం ఫిర్యాదు మేరకు 2017 మే నెలలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ పేరు మినహా మిగిలిన అందరి మీద కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని లోకాయుక్తకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి గంగారామ్ ఒడేరియాతో సహ పలువురు ఐఏఎస్ అధికారుల మీద కేసు నమోదు చేశారు. సంవత్సరం నుంచి విచారణ జరిపిన లోకాయుక్త సిట్ అధికారులు త్వరలో సుప్రీం కోర్టులో నివేదిక సమర్పిస్తారని సమాచారం.

English summary
Special Investigation Team (SIT) will submit its investigation report to the Supreme Court on nmisapproppriation in Janthakal mining renewal case which alleged that the Karnataka Chief Minister HD Kumaraswamy was involved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X