వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక స్పీకర్ రాజీనామా.. చేయాల్సిందంతా పక్కగా చేసిపోయాడుగా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక స్పీకర్ కే.ఆర్ రమేశ్ కుమార్ రాజీనామా ! | Karnataka Assembly Speaker Ramesh Kumar Resigns

బెంగళూరు : కర్ణాటక స్పీకర్ కే ఆర్ రమేశ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆయన అసెంబ్లీ అధికారికి అప్పగించారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన వెంటనే తన పదవీకి రాజీనామా చేశారు. దీంతో యడియూరప్ప ప్రభుత్వం కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకొనుంది. కాంగ్రెస్ నేత రమేశ్ కుమార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి .. సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్‌గా వ్యవహరించారు.

బలపరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం నెగ్గింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవీ చేపట్టిన రమేశ్ కుమార్ రాజీనామా చేశారు. సభా సాంప్రదాయాల ప్రకారమే ఆయన నడుచుకున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వం పడిపోతే సీఎం, మంత్రులు రాజీనామా ఎలా చేస్తారో స్పీకర్ పదవీ కూడా అంతే. అయితే యడియూరప్ప బలపరీక్ష తర్వాత రమేశ్ రాజీనామా చేశారు. అంతేకాదు కర్ణాటక 15వ అసెంబ్లీలో రమేశ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో గానీ, కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సమయం తీసుకోవడంలో గానీ ప్రభుత్వ అనుకూలంగా .. స్పీకర్‌గా తన విచక్షణాధికారులను వినియోగించారు.

karnataka speaker ramesh resign

అయితే ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఇవాళ ఓ తెలుగు టీవీ చానెల్‌లో ఫోన్‌లో మాట్లాడిన రమేశ్ కుమార్ త నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎందుకు చేశారో పిలిచానని .. అయినా వారు రాలేదని పేర్కొన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించలేదని అందుకోసమే మళ్లీ పిలిచానని గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు తమ పరిధి మీరి ప్రవర్తించినప్పుడు మాత్రమే ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాజీనామాలు సరిగా ఇవ్వరు, రూల్ బుక్ నియమాలు పాటించరు అని పేర్కొన్నారు. 35వ రాజ్యాంగ సవరణ ప్రకారం 190 బీ కింద స్పీకర్‌కు విచారణ చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. అలానే తాను 183 సెక్షన్ కింద రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. తన విధి నిర్వహణలో రాజ్యాంగ పరిధి మేరకు విధులు నిర్వర్తించానని స్పష్టంచేశారు.

English summary
Karnataka speaker Ramesh Kumar steps down handing over resignation letter to assembly officer. new speaker to be elected yediyurappa government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X