వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 50 కోట్లు ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా, ఆపరేషన్ కమల, స్పీకర్ సంచలన వ్యాఖ్యలు, రాజకీయం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆపరేషన్ కమలలో భాగంగా తనకు రూ. 50 కోట్లు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదని కర్ణాటక స్పీకర్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్ కుమార్ అన్నారు. తన రాజకీయ జీవితానికి మచ్చ వచ్చే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అదే నిజం అయితే రాజీనామా చేస్తానని స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు.

బెంగళూరులోని విధాన సౌధలో మాట్లాడిన స్పీకర్ రమేష్ కుమార్ తన మీద వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, కావాలనే తన మీద కుట్ర పన్నుతున్నారని విచారం వ్యక్తం చేశారు. తనమీద వచ్చిన ఆరోపణలపై నిద్రలేని రాత్రులు గడిపానని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.

Karnataka speaker went emotional during session on allegation of receiving Rs 50 crore to accept resignation.

శుక్రవారం రాత్రి తాను రాయచూరు నుంచి రైలులో బెంగళూరు వచ్చానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చెప్పారు. బెంగళూరులో తాను అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నానని, కనీసం ప్రభుత్వ బంగ్లాను తీసుకోలేదని, తన ఇంటి అద్దె ఎంతో తన మీద ఆరోపణలు చేస్తున్న వారికి తెలుసా ? అంటూ స్పీకర్ రమేష్ కుమార్ ప్రశ్నించారు.

తనకు రూ. 50 కోట్లు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు, ఆ డబ్బు తాను ఎక్కడ పెట్టుకోవాలి, తనకు ఆ నగదు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. తన రాజకీయ జీవితానికి అన్యాయం చెయ్యాలని ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు.

మాటల మధ్యలో మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయ్ పేరు తెరమీదకు తెచ్చిన స్పీకర్ ఆయన రాజకీయ జీవితం తనకు ఆదర్శం అన్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టిన సమయంలో వాజ్ పేయ్ నిజాయితిగా రాజీనామా చేశారని, 40 సంవత్సరాల తన రాజకీయ జీవితం ఆయన చూశారని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.

తన రాజకీయ జీవితానికి మచ్చ వచ్చే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్పీకర్ రమేష్ కుమార్ ఆరోపించారు.
తాను రూ. 50 కోట్లు లంచం తీసున్నానని వస్తున్న ఆరోపణలను స్పీకర్ రమేష్ కుమార్ తిప్పికొట్టారు. తాను లంచం తీసుకున్నానని నిరూపిస్తే తరువాత ఏమి చెయ్యలో తనకు బాగాతెలుసని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు.

English summary
Karnataka assembly speaker Ramesh Kumar went emotional during session on allegation of receiving Rs 50 crore to accept resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X