వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రభుత్వం షాక్, ఉప ఎన్నికలకు సిద్దం, అయ్యో పాపం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ అర్జీ సుప్రీం కోర్టులో ఆలస్యం అవుతోంది. ఇదే సమయంలో 17 మంది అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. వీలైనంత త్వరగా కర్ణాటకలో ఉప ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ కు బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం లేఖ రాసిందని వెలుగు చూడటంతో అనర్హత ఎమ్మెల్యేలు షాక్ కు గురైనారు.

డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !

పోటీకి నో చాన్స్ !

పోటీకి నో చాన్స్ !

అనర్హత ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేదు. యడియూరప్ప ప్రభుత్వంలో ఆ 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే చాన్స్ లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే వాళ్లు మళ్లీ ఎమ్మెల్యేలు అయ్యే చాన్స్ మాత్రం ఉంది. ఉప ఎన్నికల ముందే సుప్రీం కోర్టు ఆదేశాలు రావాలని అనర్హత ఎమ్మెల్యేలు ఆ దేవుడిని కోరుకుంటున్నారు. అంతకంటే వారికి ఏ దారి కనపడటం లేదు.

జనవరి 25 డెడ్ లైన్ !

జనవరి 25 డెడ్ లైన్ !

కర్ణాటకలోని విధాన సౌధా కార్యాలయం అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేశారని వివరించారు. జనవరి 25వ తేదీ లోపు వారి ఖాలీల భర్తి పూర్తి చెయ్యవలసి ఉంటుందని, వీలైనంత త్వరగా ఉప ఎన్నికలు నిర్వహించాలని విధాన సౌధా కార్యాలయం అధికారులు భారత ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

 సుప్రీం తీర్పు కంటే ముందే ఎన్నికలు వస్తే ?

సుప్రీం తీర్పు కంటే ముందే ఎన్నికలు వస్తే ?

అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు కంటే ముందే ఉప ఎన్నికలు వస్తే కనీసం వాళ్లు నామినేషన్ వెయ్యడానికి కూడా అవకాశం లేకుండాతుంది. సుప్రీం కోర్టు తీర్పుకంటే ముందే ఉప ఎన్నికల తేదీ ప్రకటిస్తే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కనీసం ఆరు సంవత్సరాల వరకూ అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం లేకుండాపోతుంది.

బీజేపీకి టచ్ లో ఉంటే !

బీజేపీకి టచ్ లో ఉంటే !

అప్పటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ 17 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల టిక్కెట్ మీద పోటీ చేసి అదే పార్టీల మీద తిరుగుబాటు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ జెండాల మీద గెలిచిన తరువాత వారి పదవులకు రాజీనామా చేసి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు సహకరించారు. ప్రస్తుతం 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు.

సుప్రీం కోర్టులో విచారణ

సుప్రీం కోర్టులో విచారణ

అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ సోమవారం పరిశీలిస్తామని ఇప్పటికే సుప్రీం కోర్టు చెప్పింది. అయితే అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ ఆలస్యం అయితే వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిపోతుందని, అంతకు ముందే ఉప ఎన్నికలకు తేదీ ప్రకటిస్తే వాళ్లు మరన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం.

English summary
Karnataka State assembly office wrote letter to central election commission to announce by election notification as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X