వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనికుడి కిడ్నీ మార్పిడి, అనుమతి ఇవ్వని అధికారులు, నిర్లక్షం, హై కోర్టుకు బాధితులు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రజలను సురక్షితంగా కాపాడటానికి సర్వం త్యాగం చేయ్యడానికి సిద్దం అయ్యి దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాటం చెయ్యడానికి సిద్దం అయిన సైనికుడి కష్టాలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. నియమాలు, నిబంధనలు అంటూ సైనికుడిని ఇబ్బందులకు గురి చేశారు.

కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వ అధికారులకు చివాట్లు పెట్టంది. అయినా అధికారుల్లో మార్పులేదు. పుణేలోని ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్న కర్నల్ పంకజ్ భార్గవ్ కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. కర్నల్ పంకజ్ భార్గవ్ కు కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

Karnataka state health Department decline to kidney transplant of an soldier.

జైపూర్ కు చెందిన హర్ష శర్మ అనే వ్యక్తి కర్నల్ పంకజ్ భార్గవ్ కు కిడ్నీ దానం చెయ్యడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులకు కిడ్నీ మార్పిడి చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కర్నల్ పంకజ్ భార్గవ్ అర్జీ సమర్పించారు.

ఆరోగ్య శాఖ అధికారులు అనుమతి ఇవ్వక పోవడంతో కర్నల్ పంకజ్ భార్గవ్ కోర్టును ఆశ్రయించారు. కిడ్నీ మార్పిడి కోసం అర్జీదారుడు సమర్పించిన పత్రాలు పరిశీలించాలని, అన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లో అనుమతి ఇవ్వాలని మే 10వ తేదీ కోర్టు ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కర్నల్ పంకజ్ భార్గవ్ సమర్పించిన అర్జీని పక్కన పెట్టి ఆయన కిడ్నీ మార్పిడికి అనుమతి ఇవ్వలేదు. రెండు నెలలు అయినా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కర్నల్ పంకజ్ భార్గవ్ న్యాయవాది కర్ణాటక హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. సైనికుడి పట్ల నిర్లక్షం చేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలని పంకజ్ భార్గవ్ న్యాయవాది కోర్టులో మనవి చేశారు.

English summary
Karnataka state health Department decline to kidney transplant of an soldier. This lead to Karnataka high court red face and questions the govt about the policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X