బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

lockdown:కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ మాస్టర్ ప్లాన్, 2 లక్షల మంది, 4 వేల బస్సులు, రూ. 8 కోట్లు, సీఎంలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా lockdown విధించడంతో కర్ణాటకలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపించడానికి మూడు రాష్ట్రాలు కలిసి మాస్టర్ ప్లాన్ అమలు చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో సుమారు 2 లక్షల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారని, వారిని 4 వేల బస్సుల్లో తరలించడానికి దాదాపు రూ. 8 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని కర్ణాటక ప్రభుత్వం అంచానా వేసింది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వలస కార్మికులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపించి ఆ రెండు రాష్ట్రాల్లో ఉంటున్న కన్నడిగులను కర్ణాటకకు తరలించడానికి మూడు రాష్ట్రాల అధికారులు చర్చలు మొదలు పెట్టారు.

Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !

 బెంగళూరు, కర్ణాటకలో 2 లక్షల మంది !

బెంగళూరు, కర్ణాటకలో 2 లక్షల మంది !

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, వలస కూలీలు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర సమస్యలతో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో సుమారు 2 లక్షల మందికిపైగా వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు చిక్కుకున్నారని కర్ణాటక ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

లాక్ డౌన్ తో వేరే మార్గాలు లేవు

లాక్ డౌన్ తో వేరే మార్గాలు లేవు

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో వేరే మార్గాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. వారందరినీ వారి స్వస్థలాలకు తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల ప్రజలు చిక్కుకుపోయారు ? అంటూ కర్ణాటక ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారు.

 కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ మాస్టర్ ప్లాన్

కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ మాస్టర్ ప్లాన్

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో కొన్ని లక్షల మంది వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు చిక్కుకుపోయారు. వారందరిని వారి స్వస్థలాలకు పంపించడానికి ఏర్పాట్లు చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలను వెంటనే వారి రాష్ట్రాలకు పంపించడానికి ఏర్పాట్లు చెయ్యాలని, ఆ రెండు రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులకు సూచించారు.

 4 వేల బస్సులు, రూ. 8 కోట్లు ఖర్చు

4 వేల బస్సులు, రూ. 8 కోట్లు ఖర్చు

కర్ణాటకలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలను వారి స్వస్థలాలకు పంపించడానికి కర్ణాటక ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను వారి స్వస్థలాలకు పంపించాలంటే ఒక్క బస్సులో 25 మందికి అవకాశం ఉంటుందని, వారిని తరలించడానికి 4, 000 బస్సులు అవసరం అవుతాయని, అందుకు సుమారు రూ. 8 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటక ప్రభుత్వ అధికారుల తెక్కల ప్రకారం బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా వలస కార్మికులు, కూలీలు ఉన్నారని సమాచారం.

 తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం

కర్ణాటకలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను మీ రాష్ట్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తెలంగాణలో చిక్కుకున్న కన్నడిగులను మా రాష్ట్రానికి పంపించడానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కరోనా వైరస్ పరీక్షలు చేసిన తరువాత ఆ వ్యాధి లేదని నిర్దారించిన తరువాత కర్ణాటకకు కన్నడిగులను పంపించాలని తెలంగాణ ప్రభుత్వానికి మనవి చేశారు.

 ఆంధ్రా సర్కారుతో చర్చలు !

ఆంధ్రా సర్కారుతో చర్చలు !

కర్ణాటకలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్మికులు, కూలీలను ఆ రాష్ట్రానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని వివిద జిల్లాలో చిక్కుకున్న కన్నడిగులను కర్ణాటకకు పంపించడానికి చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం మనవి చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మూడు రాష్ట్రాల ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సుల్లో తరలించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నాయి.

మొత్తం మీద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిక్కుకున్న మూడు రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లడానికి సిద్దం అయ్యారు.

English summary
Coronavirus lockdown: Karnataka Telangana And Andhra Pradesh Jointly Plans For Lifting Migrant Labours. After central government gives permission for Lifting interstate Migrant Labours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X