బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు ఫైర్‌ బ్రాండ్ ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరికి మళ్లీ స్థాన చలనం: మూడేళ్లలో రెండోసారి..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో పని చేస్తోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి బదిలీ అయ్యారు. మూడేళ్ల కాలంలో ఆమె బదిలీ కావడం ఇది రెండోసారి. రోహిణి సింధూరిని దేవాదాయ శాఖ కమిషనర్‌గా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ టీఎం గురువారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతో పాటు మరొకరిని మాత్రమే బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఆ ప్రాచీన శివాలయంలో తెలుగు ఐఎఎస్ రోహిణి సింధూరి పేరు మీద ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా? ఆ ప్రాచీన శివాలయంలో తెలుగు ఐఎఎస్ రోహిణి సింధూరి పేరు మీద ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా?

ఇద్దరే బదిలీ..

ఇద్దరే బదిలీ..

ప్రస్తుతం రోహిణి సింధూరి.. కర్ణాటక సిల్క్ పరిశోధన, అభివృద్ధి మండలి కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమెను దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా పని చేస్తోన్న సీపీ శైలజను సిల్క్ బోర్డుకు బదిలీ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. రోహిణి సింధూరికి స్థాన చలనం కల్పించడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచీ ఆమె రాజకీయ నాయకుల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడమే దీనికి కారణమని తెలుస్తోంది.

హసన్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ..

హసన్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ..

2009 కర్ణాటక క్యాడర్ ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి. 2017లో ఆమె హసన్ జిల్లా కలెక్టర్‌గా నియమితులు అయ్యారు. ఎక్కువ రోజులు ఆ పదవిలో కొనసాగలేకపోయారు. 2018 జనవరి 22న ఆమెను పరిశ్రమల, మౌలిక దుపాయాల కల్పనా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆమెను బదిలీ చేయడాన్ని ఎన్నికల కమిషన్ తప్పు పట్టింది. దీనితో మార్చి 5వ తేదీన ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ప్రభుత్వం.

 క్యాట్‌కు వెళ్లినా..

క్యాట్‌కు వెళ్లినా..


అదే నెల 7వ తేదీన మళ్లీ ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులను వెలువడించింది. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ కమిషనర్‌గా నియమించింది. రోహిణి సింధూరి స్థానంలో హసన్ కలెక్టర్‌గా డీ రణ్‌దీప్‌ను నియమించింది. తన బదిలీపై రోహిణి సింధూరి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వద్దే తేల్చుకోవాలంటూ మార్చి 21వ తేదీన క్యాట్ స్పష్టం చేస్తూ ఉత్తర్వులను జారీచేసింది.

 గత ఏడాది ఫిబ్రవరి 22న బదిలీ.. అంతలోనే మళ్లీ..

గత ఏడాది ఫిబ్రవరి 22న బదిలీ.. అంతలోనే మళ్లీ..

క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై రోహిణి సింధూరి మార్చి 22వ తేదీన హైకోర్టులో సవాల్ చేయగా.. తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వచ్చింది. 2018 జూన్ 25వ తేదీన రోహిణిని మళ్లీ హసన్ కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలను ఇచ్చింది. రెండోసారి ఆమె హసన్ కలెక్టర్‌గా నియమితులు అయ్యారు. 2019 ఫిబ్రవరి 22వ తేదీన సింధూరిని మళ్లీ బదిలీ చేశారు. సిల్క్ పరిశోధనా, అభివృద్ధి మండలి కమిషనర్‌‌గా నియమించారు. ఇంకా ఏడాది కూడా గడవక ముందే మరోసారి సింధూరిని బదిలీ చేశారు. సిల్క్ పరిశోధనా మండలి నుంచి దేవాదాయ శాఖ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

English summary
Telugu IAS Officer Rohini Sindhuri once again transferred in Karnataka. The Karnataka Government led by BS Yediyurappa issued the orders on Thursday. Rohini Sindhuri transferred and posted as Commissioner of Endowment Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X