వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:ఏప్రిల్ 21 తర్వాత కాస్త సడలింపు, కర్ణాటకలో మినహాయింపు ఇచ్చేది వీటికే...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సందర్భంగా విధించిన లాక్‌డౌన్‌కు కర్ణాటక ప్రభుత్వం మినహాయింపులను ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి సరుకు రవాణా వాహనాలు, పాసులు కలిగిన వాహనాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది.

 Karnataka to partially relax lockdown from April 21

కంటైన్మెంట్ ఏరియా వెలుపలకు ద్విచక్ర వాహనం అనుమతిస్తామనే ఇదివరకే ఇచ్చిన ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బెంగళూరులోని 32 కంటైన్మెంట్ జోన్లు సహా, ఎనిమిది జిల్లాల్లో గల హాట్ స్పాట్ కేంద్రాల్లో మినహాయింపు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. బెంగళూరు అర్బన్, మైసూర్, బెలగవి, దక్షిణ కన్నడ, బిదర్, కలబురగి, బాగల్ కోట్, ధార్వాడ్ క్లస్టర్‌లో మినహాయింపులు ఇస్తారు.

కంటోన్మైంట్ జోన్, బఫర్ జోన్ పరిధిలో మూడు కిలోమీటర్ల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, రామనగరను ఒక జిల్లాగా పరిగణిస్తారు. హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో కమాండర్ సహా స్థానిక పోలీసును నియమిస్తారు. ఆ ప్రాంతంలో గల కమాండర్‌కు మేజిస్ట్రేయల్ అధికారం ఉంటుంది. ఆ ప్రాంతంలో రద్దీ, వారికి కావాల్సిన కనీస సౌకర్యాలను సమకూరుస్తారు.

Recommended Video

TikTok Users Beware, TikTok Addiction Leads To Lost Life

ఐటీ సెక్టార్‌లో 33 శాతం మంది ఉద్యోగులు పనిచేయడానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే వారు అద్దెకు తీసుకున్న బస్సుల్లో మాత్రమే కార్యాలయానికి రావాలని షరతు విధించారు. మిగతా వారు యథావిధిగా వర్క్ ఫ్రం చేయాలని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ పనులకు కూడా అనుమతి ఇస్తున్నామని, అయితే హాట్ స్పాట్ కేంద్రాల్లో మాత్రం పనిచేసేందుకు వీలులేదని సీఎం యడియూరప్ప స్పష్టంచేశారు. బస్సులు, మెట్రో, రైళ్లు, విమాన సేవలు మే 3వ తేదీ వరకు అనుమతించబోమని స్పష్టంచేశారు. విద్యాసంస్థలు, మత ప్రార్థనలు చేసే చోటు, మాల్స్, థియేటర్లు, సెలూన్లు, జిమ్స్, కమర్షియల్ ప్రాంతాలు మూసివేస్తామని స్పష్టంచేశారు.

English summary
Karnataka government on Saturday announced new measures to ease lockdown restrictions, including movement of goods vehicles, and cars effective from April 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X