వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక బలపరీక్ష: ఆ మూడు అవకాశాలపై బిజెపి కన్ను, అద్భుతం జరిగేనా, ఎవరిది పై చేయి?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప మే 19వ తేది సాయంత్రం శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అధికార బిజెపిని ఓడించేందుకు గాను కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి వ్యూహారచన చేస్తోంది.

కర్ణాటకలో బిజెపికి 104 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి 116 సీట్లున్నాయి. అయితే కర్ణాటక రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 111 సీట్లు. అయితే మ్యాజిక్ ఫిగర్ కు బిజెపికి ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే బిజెపి కంటే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి మ్యాజిక్ ఫిగర్ కంటే ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు.

Karnataka trust vote: Here are the three possibilities that one could expect

కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా బొపయ్యను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ వాజ‌బాయ్ వాలా నియమిస్తూ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు. నిభంధనలకు విరుద్దంగా బొపయ్య నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది.

విశ్వాస పరీక్షలో బిజెపి విజయం సాధించాలంటే కొన్ని అవకాశాలను ఆ పార్టీ పరిశీలిస్తోంది. విశ్వాస పరీక్షకు ముందే కాంగ్రెస్, జెడి(ఎస్) ల కూటమిలోని కొందరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ప్రయత్నిస్తోందని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాతో సభలో సభ్యుల సంఖ్య తగ్గిపోతోంది. తద్వారా సభలో బిజెపికి తక్కువ మంది ఎమ్మెల్యేలు అవసరం కానున్నారు. అయితే ఎమ్మెల్యేల రాజీనామా ప్రక్రియ ఎలాంటి అనర్హత కిందకు రాదు.

ఎమ్మెల్యేల గైరాజర్ లేదా క్రాస్ ఓటింగ్ అంశంపై కూడ బిజెపి నాయకత్వం ఆశతో ఉంది. విశ్వాస పరీక్ష సమయంలో కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి చెందిన ఎమ్మెల్యేల్లో కొందరిని గైరాజరయ్యేలా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు.. ఎమ్మెల్యేలను గైరాజర్ చేయడం ద్వారా అసెంబ్లీలో సభ్యుల సంఖ్యా బలం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో బలాన్ని నిరూపించుకొనేందుకు తక్కువ మంది సభ్యులు అవసరం అవుతారు.

మరోవైపు కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి చెందిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బిజెపి నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్ష సమయంలో బిజెపికి అనుకూలంగా ఓటు వేస్తే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే విశ్వాస పరీక్ష సమయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పార్టీ విప్ ను ధిక్కరించినందుకు పార్టీ చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినా కూడ విప్ ధిక్కరణ కిందకు వస్తోంది. ఆ సమయంలో కూడ ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తప్పకపోవచ్చు.

మే 19వ తేదిన బలనిరూపణలో బిజెపి ఓటమి పాలైతే రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్ ను కోరుతారు. ఆ పార్టీ వినతి మేరకు కొత్తగా బలనిరూపణకు సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో కూడ విశ్వాస పరీక్షలో రెండో సారి బలనిరూపణకు దిగిన పార్టీ లేదా కూటమి ఓటమి పాలైతే మరోసారి చివరిగా విశ్వాస పరీక్షకు గవర్నర్ అవకాశాన్ని కల్పిస్తారు.అయితే ఈ తరహ పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారు.

English summary
The crucial Karnataka trust vote is set to be held on Saturday at 4 pm. The BJP has 104 while the Congress and JD(S) have claimed the support of 116. The magic number in the House in 111 since elections to two assembly constituencies have been postponed and H D Kumaraswamy is holding two seats. The total strength of the House including Kumaraswamy’s two seats is 222.కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప మే 19వ తేది సాయంత్రం శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అధికార బిజెపిని ఓడించేందుకు గాను కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి వ్యూహారచన చేస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X