వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అప్‌డేట్స్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : యడియూరప్ప ప్రభుత్వం ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కొబోతోంది. అయితే ఒకరోజు ముందు స్పీకర్ రమేశ్ కుమార్ కీలక నిర్ణయం కలకలం రేపింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో రాజకీయంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్, జేడీఎస్ 14 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్సన్ వేటు వేశారు. మరో నాలుగేళ్లు వారు ఎన్నికల్లో పోటీచేయరాదని స్పష్టంచేశారు. ఈ క్రమంలో యడియూరప్ప విశ్వాస పరీక్ష ఉత్కంఠ రేపుతోంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. అయితే 17 మందిపై వేటువేయడంతో ఆ సంక్య 207కి చేరుకోనుంది. అయితే సభకు అందరూ సభ్యులు హాజరైతే మెజార్టీ మార్కు 104 సభ్యులు .. ఇప్పటికే 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప సర్కార్ విశ్వాసాన్ని నెగ్గుతుంది. కానీ రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపడుతుందోననే ఆందోళన కొనసాగుతోంది. 17 సీట్లలో ఏ పార్టీ అభ్యర్థులు గెలిస్తే .. మళ్లీ ఆ పార్టీ కీ రోల్ పోషించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Karnataka Trust Vote Live Updates: yediyurappa set to face floor test

Newest First Oldest First
12:32 PM, 29 Jul

కాసేపట్లో హైదరాబాద్‌కు రమేశ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న రమేశ్
12:31 PM, 29 Jul

బెంగళూరు

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ పదవీకి కేఆర్ రమేశ్ కుమార్ రాజీనామా
11:50 AM, 29 Jul

బెంగళూరు

మ్యాజకి ఫిగర్ 104 దాటిన యడియూరప్ప
11:48 AM, 29 Jul

యడియూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా 106 ఓట్లు, విపక్ష కాంగ్రెస్; జేడీఎస్ కూటమికి 99 సభ్యుల మద్దతు
11:47 AM, 29 Jul

బెంగళూరు

కర్ణాటక : మూజువాణి ఓటుతో బలపరీక్ష నెగ్గిన యడియూరప్ప
11:44 AM, 29 Jul

బెంగళూరు

అధికారం శాశ్వతం కాదు, ఆ విషయాన్ని యడియూరప్ప గుర్తుంచుకోవాలి : కుమారస్వామి
11:43 AM, 29 Jul

బెంగళూరు

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు, ఎమ్మెల్యేలను రోడ్లపైకి తీసుకొచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించారు
11:36 AM, 29 Jul

బెంగళూరు

నా 14 నెలల పాలన తెరిచిన పుస్తకం, యడియూరప్ప అడిగే ప్రశ్నలకు తన వద్ద రికార్డులతో సహా సమాధానాలు ఉన్నాయి
11:32 AM, 29 Jul

యడియూరప్ప ఎన్నడూ ప్రజామోదంతో సీఎం కాలేడు : సిద్ధరామయ్య
11:27 AM, 29 Jul

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు : కుమారస్వామి
11:27 AM, 29 Jul

14 నెలల్లో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేశా : కుమారస్వామి
11:26 AM, 29 Jul

అధికారంలో ఎంతకాలం ఉంటారో మీకే తెలియదు : సిద్దరామయ్య
11:25 AM, 29 Jul

బెంగళూరు

యడియూరప్ప ఇప్పటివరకు ప్రజామోదంతో సీఎం కాలేదు : సిద్దరామయ్య
11:24 AM, 29 Jul

బెంగళూరు

ప్రజల ఆలోచనలు, అభీష్టం మేరకు యడియూరప్ప పనిచేయాలని కోరుకుంటున్నా : సిద్ధరామయ్య
11:23 AM, 29 Jul

బలపరీక్షపై మాట్లాడుతున్న మాజీ సీఎం కుమారస్వామి
11:22 AM, 29 Jul

బెంగళూరు

ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకు యడియూరప్ప ధన్యవాదాలు
11:15 AM, 29 Jul

బెంగళూరు

ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తానన్న యడియూరప్ప
11:13 AM, 29 Jul

ప్రజా సమస్యల పరిష్కారంలో అందరినీ కలుపుకొనిపోతాం : యడియూరప్ప
11:12 AM, 29 Jul

ప్రజల ఆశయాలు, అవసరాల మేరకు పనిచేస్తానని యడియూరప్ప ప్రకటన
11:11 AM, 29 Jul

బెంగళూరు

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తామని విదాన సౌధలో ప్రసంగించిన సీఎం యడియూరప్ప
11:10 AM, 29 Jul

బలపరీక్షపై చర్చ

బలపరీక్షపై చర్చను ప్రారంభించిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య
11:07 AM, 29 Jul

బెంగళూరు

ప్రారంభమైన విదాన సౌధ, కాసేపట్లో బలపరీక్ష ఎదుర్కొనున్న సీఎం యడియూరప్ప
11:05 AM, 29 Jul

న్యూఢిల్లీ

తమ అనర్హతపై స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు రమశ్, మహేశ్, శంకర్
కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప బలపరీక్ష
10:44 AM, 29 Jul

తమను కొందరు కొనుగోలు చేశారనే వార్తల్లో నిజం లేదు : రెబల్ ఎమ్మెల్యే బైరతి
10:41 AM, 29 Jul

బెంగళూరు

కర్ణాటక :విధానసౌధలో ముగిసిన సీఎల్పీ భేటీ, సిద్ధరామయ్య అధ్యక్షతన కొనసాగిన సమావేశం
10:33 AM, 29 Jul

బెంగళూరు

కర్ణాటక : విదాన సౌధకు చేరుకున్న స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్
10:27 AM, 29 Jul

బెంగళూరు

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హతతో బీజేపీకి లాభమా ?
10:15 AM, 29 Jul

బెంగళూరు

అంతకుముందు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడియూరప్ప
10:12 AM, 29 Jul

బెంగళూరు

విదానసౌధలో సీఎల్పీ సమావేశం, హాజరైన సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండురావు, కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, ఈశ్వర్ కంద్రే ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
10:09 AM, 29 Jul

ముంబై టు బెంగళూరు

బెంగళూరు బయల్దేరిన రెబల్ ఎమ్మెల్యేలు బసవరాజు, ఎంటీబీ నాగరాజు, ఎస్టీ సోమశేఖర్
READ MORE

English summary
The yediyurappa government is facing a confidence test today. However, a day before, Speaker Ramesh Kumar's decision was a disturbing one. The disqualification of Rebel MLAs is politically sensational. Suspended vote on 14 MLAs of Congress and JDS Another four years made it clear that they would not contest the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X